Doctor: రూపాయికే హార్ట్ ఆపరేషన్.. ఆ డాక్టర్ నిజంగా గ్రేట్ కదా!

Doctor: ప్రస్తుతం ఆరోగ్యం ఒక వ్యాపారం అయిపోయింది. కరోనా నుంచి ఇది మరింత పెరిగింది. సాధారణ జర్వం వచ్చి ఆసుపత్రికి వెళ్తే,జోబు గుళ్లు చేసుకోవాల్సిందే. అసలు డాక్టర్ ను కన్సల్ట్ అవ్వటానికే వందల రూపాయల ఫీజును వసూలు చేస్తున్నారు.

ఇక, ప్రభుత్వ దవాఖానలు అంటారా.. చెప్పనవసరం లేదు. స్వతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా అనుకున్నంత మేర మార్పు రాలేదు. అయితే పేదలపాలిట పెన్నిది అనేలా ఓ ట్రస్ట్ ముందుకు వచ్చింది. ఆ ఛారిటబుల్ ట్రస్ట్ పేదలకు ఒక్క రూపాయితో వైద్యం అందిస్తోంది.

రాంనగర్ లోని జీజీ చారిటబుల్ హాస్పిటల్ లో ఒక్క రూపాయి ఫీజుతో వైద్య సేవలు అందిస్తున్నారు.ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్క రూపాయితో కనీసం టీ కూడా తాగలేం. టీ కాదు కదా, చాక్లెట్ కూడా రాదు. ఇప్పటి వరకు ఎన్నో వైద్య సేవలను రూపాయికే అందించిన ఈ ట్రస్ట్, హార్ట్ ఆపరేషన్ కి కేవలం ఒక్క రూపాయికే చేస్తున్నారు. పేదలందరికీ వైద్యం అందించాలనే ఉద్దేశ్యంతో రూపాయికే 24 గంటల పాటు వైద్య సేవలు అందిస్తున్నట్టు సంస్థ చైర్మన్ గంగాధర్ గుప్తా తెలిపారు.

 

ఈ వైద్య సేవలు పైడి రాకేశ్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఈ ఫౌండేషన్ ద్వారా ఇటీవలే గుండె ఆపరేషన్ చేయించుకున్న బాధితుల కుటుంబ సభ్యులు గంగాధర్ గుప్తాకు, రాకేశ్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇలా ఎందరో పేదలకు రాకేశ్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా వైద్యం, విద్య ఉచితంగా అందిస్తున్నారు.

 

రాకేశ్ రెడ్డి మనసు వెన్నలాంటిదని అక్కడ వైద్యం చేయించుకున్న వారు చెబుతున్నారు. ఏం సంపాదించిన సమాజానికి ఎలా ఉపయోగపడాలని ఆయన అంటున్నారు. ఏ రకంగా బలహీనులకు సాయపడాలి, అలానే పేదవారికి ఏ రకంగా సాయం అందించాలి అనే ఉద్దేశ్యంతోనే మేము ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.

 

కేవలం హైదరాబాద్ లోనే కాకుండా తిరుపతి, విశాఖపట్నం, వరంగల్ లో కూడా ఆసుపత్రుల నిర్మాణం చేపట్టాలని అనుకున్నాం. ఏదో ఒకరకంగా పేదవాళ్లకి సాయపడాలనేది నా ముఖ్య ఉద్దేశం. దేవుడి ఆశీర్వదం ఉంటే భవిష్యత్ లో మరెన్నో కార్యక్రమాలు చేస్తామని పైడి రాకేశ్ రెడ్డి పౌండేషన్ ఛైర్మన్ తెలిపారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -