Heroine Priyamani: భర్తతో విభేదాలు? ప్రియమణి విడాకాలు తీసుకోబోతుందా?

Heroine Priyamani చిత్ర పరిశ్రమలో ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం కొద్దిరోజులు గడిచాక విడాకులు తీసుకోవడం ఈ మధ్యకాలంలో కామన్ అయిపోయింది. ఇప్పటికే ఇండస్ట్రీలో కొన్ని జంటలు ప్రేమించి పెళ్లి చేసుకొని విడాకులు తీసుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటీనటులైన చైతన్య-సమంతల విడాకుల విషయం ఇప్పటికి హాట్‌టాపిక్‌గానే నడుస్తోంది. వీరిద్దరి సంబంధించిన ఏ చిన్న ఇన్ఫర్మేషన్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. ఇక తాజాగా ఇండస్ట్రీలో మరో జంట విడాకుల తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ జంట ఎవరో ఒక్కసారి చేద్దామా.

ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా రాణించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రియమణి. ఆమె తన భర్త ముస్తఫా రాజ్‌తో విడిపోతున్నట్లు కొంతకాలంగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రియమణి తన భర్తతో గొడవల కారణంగా కొంతకాలంగా వీరిద్దరూ వేర్వేరుగా ఉంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ జంట త్వరలో విడాకులు తీసుకోవడానికి సిద్ధం అవుతున్నట్టు మీడియా వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

వీరిద్దరిపై వస్తున్న వార్తలపై ప్రియమణి టీమ్ స్పందించింది. ఈ వార్తలను కొట్టి పారేసింది. అంతేకాక ఆమె వ్యక్తిగత జీవితంపై రకరకాల కథనాలు వస్తున్నప్పటికీ వాటిలో ఏ మాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. ఇటీవల ప్రియమణి నటించిన రాకెట్రీ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా సక్సెస్‌ మీట్‌ పార్టీకి ప్రియమణి తన భర్తతో కలిసి హాజరైంది. ఈ పార్టీకి సంబంధించిన ఓ వీడియోను ఆమె సోషల్‌ మీడియాతో షేర్ చేసుకుంది. కాగా, ప్రియమణి-ముస్తఫా రాజ్‌ను 2017లో ప్రేమించి వివాహం చేసుకుంది.

అయితే ముస్తఫారాజ్ ప్రియమణిని రెండో పెళ్లి చేసుకున్నాడు. ముస్తఫారాజ్ ఇదివరకే అయేషా అనే మహిళను వివాహం చేసుకున్నాడు. అప్పట్లో ఆయన మొదటి భార్య అయేషా ముస్తాఫాపై ఆరోపణలు చేసినా ప్రియమణి తన భర్తకు అండగా నిలిచినా విషయం అందరికి తెలిసిందే. ఒక్క వీడియోతో వీరిద్దరిపై వస్తున్నా వార్తలకు చెక్ పెట్టింది ప్రియమణి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -