Priyamani: ఆ హీరోని పెళ్లి చేసుకోవాలని ఉంది.. వైరల్ అవుతున్న ప్రియమణి బోల్డ్ కామెంట్స్!

Priyamani:  తెలుగు సినీ ప్రేక్షకులకు ఒకప్పటి హీరోయిన్ ప్రియమణి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. కేవలం తెలుగు భాషలో మాత్రమే కాకుండా ఇతర భాషల్లో కూడా నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది ప్రియమణి. తెలుగు హిందీ తమిళ మలయాళ భాషల్లో నటించిన విషయం తెలిసిందే. అప్పట్లో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.

అయితే ఫుల్ ఫామ్ లో ఉన్న సమయంలో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన ప్రియమణి ఆ తర్వాత బుల్లితెరపైకి జడ్జిగా ఎంట్రీ ఇచ్చి తెలుగు తోపాటు తమిళ మలయాళ భాషల్లో కూడా అనేక రకాల సేవలకు జడ్జిగా వ్యవహరించింది. ఒకవైపు జడ్జిగా వ్యవహరిస్తూనే మరొకవైపు సినిమాలలో అడపాదడపా పాత్రల్లో నటిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రియమణి ఇటీవలే షారుక్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రియమణి చేతిలో మరికొన్ని సినిమాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ప్రియమణి 2017 వ సంవత్సరం లో ముస్తఫా రాజ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. వీళ్లిద్దరి దాంపత్య జీవితం ఎంతో అన్యోయంగా సాగుతుంది.

అయితే ప్రియమణికి మొదటి నుండి ఒక స్టార్ హీరో అంటే విపరీతమైన ఇష్టం ఉండేదట. ఆ స్టార్ హీరో మరెవరో కాదు షారుఖ్ ఖాన్. ఈయన అంటే ఈమెకి పెద్ద క్రష్ అట, ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియమణి స్వయంగా చెప్పుకొచ్చింది. షారుఖ్ ఖాన్ ని పెళ్లి చేసుకోవాలి అని కలలు కనేదట. కానీ దేవుడు వీళ్లిద్దరికీ మరో తలరాత రాసాడు. అయితే ప్రియమణి కి షారుఖ్ ఖాన్ తో ఇప్పటికీ మంచి సాన్నిహిత్యం ఉంది. గతం లో చెన్నై ఎక్స్ ప్రెస్ చిత్రం లో ఒక ఐటెం సాంగ్ చేసిన ప్రియమణి, జవాన్ చిత్రం లో ముఖ్య పాత్ర పోషించింది. ఈ రెండు సినిమాలు కూడా షారుఖ్ ఖాన్ కెరీర్ లో సంచలన విజయాలుగా నమోదు అయ్యాయి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -