Cracked Heels: కాళ్ళ పగుళ్లతో బాధ పడుతున్నారా..? ఈ చిట్కాలు పాటిస్తే సులువుగా ఆ సమస్యలకు చెక్ అంటూ?

Cracked Heels: చలికాలం ప్రారంభమైందంటే చాలు చాలామంది కాళ్ళ పగుళ్ల సమస్యతో బాధపడుతూ ఉంటారు. అయితే సరైన జాగ్రత్తలు తీసుకుంటే కాళ్ళ పగుళ్ళ సమస్యకు చెక్ పెట్టవచ్చు అంటున్నారు నిపుణులు. ప్రతిరోజు నిద్రకు ఉపక్రమించేముందు కాళ్ళను శుభ్రం చేసి పొడి గుడ్డతో తుడుచుకోవాలి. తర్వాత పగుళ్లపై కొబ్బరి నూనెతో మర్దన చేసుకుని పాదాలకి సాక్స్ లు ధరించాలి. మరుసటి రోజు ఉదయాన్నే పాత బ్రష్ తో పాదాలను రుద్ధి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. కొన్ని రోజులు ఇలా చేస్తే పాదాల పగుళ్ల నుంచి ఉపశమనం పొందవచ్చు.

అలాగే పాదాలను మీరు భరించగలిగే అంత వేడి నీటిలో మీ కాళ్ళను అరగంట పాటు ఉంచండి. ఆ తర్వాత కాళ్ళని పొడి గుడ్డతో శుభ్రం చేసి ఆపై కాళ్ళకి కొబ్బరి నూనె అప్లై చేయండి. ఇలా చేయడం వలన పాదాలు మృదువుగా తయారవుతాయి. అలాగే పాదాలకి ఆవనూనెను మర్దన చేసినా కూడా పగుళ్లు మెత్తబడి కొద్ది రోజులకి పాదాల పగుళ్ళ నుంచి ఉపశమనం లభిస్తుంది. వీటన్నిటితో పాటు పోషకాహారం తప్పనిసరిగా తీసుకోవాలి.

క్యాల్షియం, ఐరన్, జింక్, ఒమేగా త్రీ, ఫ్యాటీ ఆమ్లాలు సమృద్ధిగా లభించే ఆహారం తీసుకోవడం మంచిది. యాంటీ మైక్రో బయల్, ఆంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్న తేనే పగిలిన పాదాలకి చక్కని మాయిశ్చరైసర్ గా పనిచేస్తుంది. పాదాల పగుళ్లు ఉన్నచోట్ల తేనె రాసుకొని అరగంట పోయిన తర్వాత పాదాలని శుభ్రం చేసుకోవడం వలన మంచి ఉపశమనం లభిస్తుంది అలాగే కొబ్బరి నూనె కూడా పొడి చర్మానికి తేమను అందించి తాజాగా మారుస్తుంది.

రాత్రిపూట నిద్రపోయే ముందు పాదాలకి కొబ్బరినూనె రాసుకుంటే పగుళ్ల బాధ తగ్గుతుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్ల వల్ల కూడా పాదాలకు పగుళ్ళు వస్తూ ఉంటాయి. అప్పుడు వెనిగర్ కలిపిన నీటిలో పాదాలను కొద్దిసేపు ఉంచితే పగుళ్లు తగ్గిపోతాయి.అలాగే పగిలిన పాదాలకు ఓట్ మిల్, పాల మిశ్రమం కూడా మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఈ మిశ్రమాన్ని ప్రతివారం పాదాలకు రాసుకుంటే పగుళ్లు మాయమవుతాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -