Gas Cylinder: సిలిండర్ కదిలించకుండా గ్యాస్ ఎంత వరకు ఉందో తెలుసుకోవాలా.. అసలేం జరిగిందంటే?

Gas Cylinder: ప్రస్తుత కాలంలో ఇంట్లో వంట చేయాలి అంటే ప్రతి ఒక్కరు కూడా గ్యాస్ సిలిండర్ ఉపయోగిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఒకప్పుడు కట్టెల పొయ్యి మీదే వంట చేసేవారు అయితే ప్రస్తుతం ఆ ఇబ్బందులు లేకుండా మనకు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు అందుబాటులోకి రావడంతో ప్రతి ఒక్కరు కూడా గ్యాస్ సిలిండర్ల సహాయంతోనే వంట చేస్తున్నారు. అయితే కుటుంబ సభ్యులు ఎక్కువమంది ఉన్నవారికి నెల రోజులకే గ్యాస్ సిలిండర్ పూర్తి అవుతూ ఉంటుంది.

అలాగే గ్యాస్ సిలిండర్ అనుకున్న సమయానికి అన్న ముందుగా అయిపోతే చాలామంది అప్పుడే సిలిండర్ అయిపోయిందా అంటూ సందేహాలను వ్యక్తం చేస్తుంటారు. ఎంత పూర్తి అయింది అనే విషయాలను మనం చాలా సులభంగా తెలుసుకోవచ్చు కేవలం చిన్న చిట్కాతో సిలిండర్ ఎంత ఖాళీ అయిందనే విషయాన్ని చాలా సులభంగా తెలుసుకోవచ్చు మరి ఆ చిట్కా ఏంటి అనే విషయానికి వస్తే..

మనం వంట కోసం ఉపయోగిస్తున్నటువంటి సిలిండర్ దగ్గరకు వెళ్లి ఒక చిన్నటి గిన్నెలో నీళ్లు తీసుకొని అందులోకి ఒక గుడ్డను తడిపి ఆ తడి గుడ్డతో సిలిండర్ పై భాగంలో పైనుంచి కింద వరకు తుడిచాలి. ఇలా నీటితో తుడవడం వల్ల సిలిండర్ ఎక్కడి వరకు అయిపోయి ఉంటుందో అక్కడి వరకు తేమ తొందరగా ఆరిపోతుంది అలాగే సిలిండర్లో గ్యాస్ ఇంకా ఎక్కడి వరకు స్టోరేజ్ అయి ఉంటుందో ఆ భాగం అంతా వెంటనే ఆరిపోదు.

ఈ విధంగా గ్యాస్ సిలిండర్ ఎంత అయిపోయింది ఇంకా ఎంత ఉందనే విషయాన్ని ఇలా సింపుల్ చిట్కాతో తెలుసుకోవచ్చు. చాలామంది సిలిండర్ ఎంత ఉంది నే విషయాన్ని తెలుసుకోవడం కోసం గ్యాస్ ను అటు ఇటు కదిలిస్తూ చెక్ చేస్తూ ఉంటారు. అయితే ఇకపై అలాంటి పని లేకుండా చాలా సింపుల్ గా గ్యాస్ చెక్ చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -