Nara Disti: దిష్టి తీసిన నిమ్మకాయలను, మిరపకాయలను తొక్కితే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

Nara Disti:  సాధారణంగా ఇళ్లల్లో పిల్లలకి చిన్న జ్వరం వచ్చినా కూడా దిష్టి తగిలింది అని చెప్పి పెద్దవాళ్ళు దిష్టి తీసి రోడ్లమీద పడేస్తూ ఉంటారు. అలాగే షాపులో నిర్వహించే వాళ్ళు ప్రతి మంగళవారం, శుక్రవారం కూడా షాపులకి దిష్టి తీసి రోడ్లమీద పడేస్తూ ఉంటారు. వాటిని తొక్కడం అశుభమని, కష్టాలు వెంటాడుతాయని చాలామందికి నమ్మకం.

అందుకే చాలామంది దిష్టి తీసిన గుమ్మడికాయలు గాని ఎండుమిరపకాయలు గాని నిమ్మకాయలు గాని రోడ్డుపై కనబడితే తప్పించుకొని వెళ్ళిపోతారు. అయితే పొరపాటున చూసుకోకుండా వాటిని మట్టేస్తూ ఉంటారు చాలామంది. అయితే ఆ తరువాత ఏం జరుగుతుందో అని టెన్షన్ పడిపోతూ ఉంటారు. నిజానికి నేటి తరం వాళ్లు నమ్మినా, నమ్మకపోయినా దిష్టి తగలటం అనేది ఉంటుంది అని స్ట్రాంగ్ గా చెప్తారు పెద్దవాళ్లు. ఎందుకంటే ప్రతి ఒక్కరి కంటి నుంచి విద్యుత్ ప్రచారం జరుగుతూ ఉంటుంది.

ఆ విద్యుత్ ప్రవాహం అవతలి వారిపై అనుకూల దిశగా పనిచేస్తే పర్వాలేదు కానీ వ్యతిరేక దిశలో పనిచేసినప్పుడే చికాకు పెరుగుతుంది. తలనొప్పి, వికారం, వాంతులు తో సహా ఒళ్లంతా నలతగా అనిపిస్తుంది దీన్నే దృష్టి తగలటం అంటారు. దృష్టి వలన జరిగిన దోషం కాబట్టి దిష్టి అంటారు. ఈ దిష్టి ని చాలామంది చాలా రకాలుగా తీస్తూ ఉంటారు. అసలు నిజానికి అలా తొక్కితే ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

వాస్తవానికి దిష్టి తీసినవి తొక్కినంత మాత్రాన ఏమి జరిగిపోదు అన్నది పండితుల మాట. ఎందుకంటే గుమ్మడికాయ, కొబ్బరికాయ, నిమ్మకాయ ఇవి మంచిని బయటకు వెదజల్లి చెడుని ఆకర్షిస్తాయి. చెడు శక్తిని ఆకర్షిస్తాయి అంటే చెడుని వెదజల్లుతాయి అని అర్థం కాదు. కాబట్టి ఈ విషయంలో అతిగా భయపడవలసిన అవసరం లేదు. అలా అని అజాగ్రత్తగా ఉండటం కూడా మంచిది కాదు. మన జాగ్రత్తలో మనం ఉండడం అనేది చాలా అవసరం.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -