Elinati Shani: ఏలినాటి శ‌ని అంటే ఏమిటి.. ఏలినాటి సమస్యకు చెక్ పెట్టే బ్రహ్మాండమైన చిట్కాలివే!

Elinati Shani: శనిగ్రహం నవగ్రహాల్లో అత్యంత ప్రభావంతమైన గ్రహం. జాతకంలో పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర ఆయన సంబంధిత నక్షత్రాలు. ఈయన నవగ్రహాలలో ఒకటి. సూర్యుని పుత్రుడు కూడా. ఈయనకు నవగ్రహాలలో మిగతా గ్రహాలకు లేనటువంటి ప్రత్యేక స్థానం ఉంది. జాతక చక్రంలో జన్మరాశి నుంచి 12, 1, 2 స్థానాల్లో శని సంచరించే కాలాన్ని ఏలినాటి శని అంటారు. శని 12వ స్థానంలో సంచరించేటప్పుడు వ్యవహారాల్లో చిక్కులు, వ్యాపారాల్లో ఒడిదుడుకులు వంటి ఉపద్రవాలు ఉంటాయి.

ఈ ఏలినాటి శని ప్రభావం ప్రతి మనిషి జీవితంలో జాతకం ప్రకారం రెండు లేదా మూడుసార్లు వస్తూ ఉంటాయి. అయితే మన కర్మ ఫలాన్ని మనం ఎలా తప్పించుకోలేమో ఏలినాటి శని ప్రభావాన్ని కూడా అలా తప్పించుకోలేము. కాకపోతే కొన్ని పూజ పద్ధతులని పాటించడం వలన శని తీవ్రతను తగ్గించుకోవచ్చు. శని పాపగ్రహం అందుకనే ఈ దశ ప్రారంభమైనప్పుడు కష్టాలు ప్రారంభమవుతాయి.

ముఖ్యంగా తుల, మకర, కుంభరాశులకు ఏలినాటి శని సమయంలో మంచి ఫలితాలను ఇస్తాడు. తులారాశి శనికి ఉచ్చ స్థానం. మకర కుంభరాశులు శని స్వక్షేత్రాలు. దీంతో ఆయా జాతకులకు మంచి ఫలితాలని ఇస్తూ ఉంటాడు. శని గ్రహ తీవ్రతను తగ్గించుకోవాలంటే విష్ణు సహస్రనామం, రుద్రం, నమకం, చమకం, ఆదిత్య హృదయంతో పాటు సుందరాకాండ పారాయణం, హనుమాన్ చాలీసా, ఆంజనేయ దండకం, శని చాలీసా, శని అష్టోత్తర సహస్రనామ స్తోత్రం చేస్తే శనిగ్రహ ప్రభావ తీవ్రత తక్కువగా ఉంటుంది.

అలాగే శని త్రయోదశి రోజు శని దేవుడిని నువ్వుల నూనెతో నల్లని వస్త్రంతో అభిషేకం చేస్తే శుభం కలుగుతుంది. కుటుంబ, ఆరోగ్య, వ్యాపార, కోర్టు కేసులు, శత్రువులు రుణాలు నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే ప్రతి శనివారం నవగ్రహాలయంలో శనిదేవుని ఆరాధించడం, శనీశ్వరుడి ముందు నల్ల నువ్వులను నైవేద్యంగా సమర్పించడం, నువ్వుల నూనెతోదీపం వెలిగించడం, పక్షులకు ఆహారం వేయటం, పరమశివుడి పంచాక్షరి మంత్రాన్ని జపించడం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చు. ముఖ్యంగా ఈశ్వర ఆరాధన, హనుమంతుని ఉపాసన చేయడం ద్వారా జాతకంలో శని దోష తీవ్రతని తగ్గించుకోవచ్చు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -