Varalakshmi Tiffins: వరలక్ష్మీ టిఫిన్స్ కేసు నిందితురాలు గురించి ఈ విషయాలు తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

Varalakshmi Tiffins: హైదరాబాదులో మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా డ్రగ్స్ కేసులు బయటపడ్డాయి. డ్రగ్స్ చేతులు మారుతుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు పోలీసులు. ఇందులో వరలక్ష్మి టిఫిన్ సెంటర్ అధినేత సనికొమ్ము ప్రభాకర్ రెడ్డి, అలాగే పల్లెటూరి పిల్లట్టు టిఫిన్ సెంటర్ నిర్వాహకుడు శివ సాయికుమార్, వీరితో మరొక మహిళ అనురాధ. ముగ్గురిని నిందితులుగా గుర్తించి అరెస్టు చేశారు పోలీసులు. అయితే ఈ నిందితులలో మహిళ అయిన అనురాధ గురించిన విషయాలు తెలుసుకుంటే విస్తుపోవాల్సిందే. విచ్చలవిడితనం ఒక స్త్రీని ఎంత పతనం చేస్తుందో ఈమె జీవితం చూస్తే తెలుస్తుంది. నిజానికి ఈ కేసులో ఈమె కీలక నిందితురాలు కావడం విశేషం.

కరీంనగర్ జిల్లా గన్నేరుగూడ కు చెందిన అనురాధ ఎంబీఏ పూర్తి చేసి గచ్చిబౌలిలోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో నెలకి లక్షల రూపాయల జీతం అందుకునే స్థాయిలో ఉద్యోగం చేస్తుంది. నానక్ రామ్ గూడ టీఎన్జీవో కాలనీలో ఈమె నివాసం. ఆమె జీతం కాకుండా ఆమెకి సొంత ఊరు నుంచి అద్దె రూపేణా నెలకి 60000 వస్తాయి. అలాగే తండ్రి పెన్షన్ నుంచి 20,000 ఈమె ఖాతాలోనే వచ్చి పడతాయి. ఒకరకంగా ఈ డబ్బుతో ఆమె లగ్జరీ లైఫ్ ని లీడ్ చేస్తూ హ్యాపీగా ఉండవచ్చు. అయితే ఈమె ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకొని అనివార్య కారణాల వలన ఆ వ్యక్తితో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటుంది.

ఆ ఒంటరితనం నుంచి బయటపడటం కోసం వీకెండ్ పార్టీలు పబ్బులు, గోవా టూర్లు వెళ్లి వస్తుండేది. క్రమంగా చెడు వ్యసనాలకి డ్రగ్స్ కి సిగరెట్లకి బానిస అయింది. ఈమె డ్రగ్స్ కోసం తరచూ గోవా కి వెళ్లి వస్తూ ఉండేది. అక్కడ ఉన్న నైజీరియన్ డ్రగ్స్ పెడ్లర్ జేమ్స్ వద్ద అనురాధ కొకైన్, ఎండిఎంఏ కొనుగోలు చేసి హైదరాబాదు తీసుకువచ్చి చుట్టుపక్కల ఉన్న కస్టమర్లకి అమ్మేది. ఆ సొమ్ముతో జల్సాలు చేసేది. ఈ క్రమంలో అనురాధకి వరలక్ష్మి టిఫిన్ సెంటర్ ఓనర్ ప్రభాకర్ రెడ్డి తో పరిచయం ఏర్పడింది. అతను కూడా డ్రగ్ ఎడిక్టే కావడంతో అనురాధ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసే క్రమంలో ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది.

వాళ్లకి తోడుగా పల్లెటూరి పుల్లట్టు టిఫిన్ సెంటర్ వెంకట శివ సాయికుమార్ కూడా పరిచయమయ్యాడు. అతనికి కూడా వీరు డ్రగ్స్ అలవాటు చేసేసారు. మొత్తానికి ముగ్గురు కలిపి డ్రగ్స్ వ్యాపారం బాగానే చేసేవారు. అయితే చివరికి పోలీసులకి దొరికిపోయి కటకటాల పాలయ్యారు. అనురాధకి తప్పేదో ఒప్పేదో చెప్పేవారు లేకపోవడం వలన జీవితాన్ని విచ్చలవిడిగా గడుపుతూ అదః పాతాళానికి పడిపోయిన ఒక అనురాధ జీవితం ఆఖరికి జైలు పాలు అయింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -