Actor Tulasi: పాచి పనులు చేసే వారి ఇంటికి కోడలుగా వెళ్లాను.. సీనియర్ నటి కామెంట్స్ వైరల్?

Actor Tulasi: దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎన్నో సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ నటిమని తులసి గురించి పరిచయం అవసరం లేదు ప్రస్తుతం ఈమె యంగ్ హీరోల సినిమాలలోను హీరో హీరోయిన్లకు తల్లి పాత్రలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా తన ఐదు దశాబ్దల సినీ కెరియర్లో సుమారు 700 కు పైగా సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న తులసి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

తాజాగా ఈమె నటించిన అనుకోని ప్రయాణం సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి తులసి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను డైరెక్టర్ శివమణినీ పెళ్లి చేసుకున్నానని మా పెళ్లి ఒక్క రోజులోనే జరిగిపోయిందని తెలిపారు.ఇక శివమణి కుటుంబ సభ్యులు చాలా పేదవారని మా అత్తగారు పాచి పనులు చేసుకుంటూ బ్రతికే వారని ఈమె తెలిపారు.

ఇక తాను ఆ ఇంటికి కోడలుగా అడుగుపెట్టిన తర్వాత ఆ ఇంటికి బాగా అదృష్టం కలిసి వచ్చిందని తన భర్త డైరెక్టర్ గా, హీరోగా కూడా మారారని తెలిపారు. అయితే ఈయన హీరోగా నటించిన సినిమాలు బాగా నష్టాలను తీసుకువచ్చాయని తెలిపారు. అదే సమయంలోనే తాను రాసిన మిణుగు తార కథ సొంతంగా నిర్మించామని అయితే ఈ సినిమా హిట్ అయితే సాయిబాబా గుడిలో ప్రభావలి చేయిస్తామని మొక్కుకున్నట్లు తెలిపారు.

ఈ సినిమా విడుదల అయ్యి ఏకంగా 13 కోట్ల రూపాయల లాభాలను తీసుకువచ్చిందని కానీ మేము సాయిబాబా గుడిలో ప్రభావలి చేయించకపోవడం వల్ల వచ్చిన డబ్బు వచ్చిన విధంగానే వెళ్లిపోయిందని తులసి వెల్లడించారు. మా తప్పు మేము తెలుసుకొని అనంతరం బాబాకు ప్రభావలి చేయించామని ఈమె వెల్లడించారు.ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ తనకు పెళ్లి కాకముందు తన తమ్ముడు అర్ధాంతరంగా మరణించడంతో తాను సాయిబాబాను ఎంతో విమర్శిస్తూ బాగా తిట్టానని తులసి వెల్లడించారు.

ఈ విధంగా సాయిబాబాను తిట్టగానే ఒకరోజు ఉదయం 3 గంటల సమయంలో బాబా నా గదిలోకి వచ్చి అమ్మా అంటూ పిలిచి ఏడు జన్మలకు నువ్వే నా తల్లివి మరొక ఆరు సంవత్సరాలలో నీ కడుపున కుమారుడిగా జన్మిస్తాను అంటూ చెప్పి మాయమయ్యారని తులసి వెల్లడించారు.అచ్చం ఆరోజు బాబా చెప్పిన విధంగానే ఆరు సంవత్సరాలకు నాకు కుమారుడు జన్మించాడని తనకు సాయి అనే పేరు పెట్టుకున్నానని ఈ సందర్భంగా ఈమె చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -