Tulasi: తులసి మొక్కను పూజించే వాళ్లు ఇలా చేయాల్సిందే.. ఏం జరిగిందంటే?

Tulasi: భారతదేశంలో హిందువులు తులసి మొక్కను పరమ పవిత్రంగా భావిస్తారు అన్న విషయం తెలిసిందే. తులసి మొక్కను దేవతగా భావించడంతో క్రమం తప్పకుండా పూజిస్తూ ఉంటారు. అందుకే హిందువుల ఇళ్లలో ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్క తప్పనిసరిగా ఉంటుంది. అంతేకాకుండా తులసి మొక్కను ఎప్పటినుంచో ఆయుర్వేద ఔషదాలలో ఉపయోగిస్తూనే ఉన్నారు. తులసి మొక్కను లక్ష్మీదేవి విష్ణువు ఇద్దరూ కొలువై ఉంటారు అని విశ్వసిస్తూ ఉంటారు. దాంతో తులసి మొక్కను పూజించడం వల్ల లక్ష్మీదేవి విష్ణువు అనుగ్రహంతో పాటు తులసి దేవి అనుగ్రహం కూడా లభిస్తుంది.

తులసి మొక్కను క్రమం తప్పకుండా పూజించడం వల్ల ఆమె అనుగ్రహం కలగడంతో పాటు ఆర్థిక ఇబ్బందులు ఏవైనా ఉంటే దూరం అవుతాయి. తులసి మొక్కను పూజించడం మంచిదే కానీ తెలిసి తెలియక కూడా తులసి మొక్క విషయంలో కొన్ని రకాల తప్పులు అస్సలు చేయకూడదు. తులసి మొక్కను పూజించేటప్పుడు కొన్ని రకాల నియమాలు తప్పనిసరి. అలాగే తులసి మొక్కకి నీళ్లు పోసేటప్పుడు కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. అలానే తులసి మొక్కని పూజించేటప్పుడు కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. అయితే ఎప్పుడు అయినా తులసి మొక్కకి నీరు పోసేటప్పుడు చాలామంది వాళ్లకి ఖాళీ ఉన్న సమయంలో నీళ్లు పోస్తూ ఉంటారు.

 

కానీ అలా చేయకూడదు.అలాగే చాలామంది తులసి మొక్కకి దీపారాధన చేయడంతో పాటు నీళ్లని కూడా ఆ సమయాల్లో పోస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా సంధ్యా సమయంలో తులసి మొక్కకి అస్సలు నీళ్లు పోయకూడదు. సాయంత్రం తులసి మొక్క కింద విష్ణుమూర్తి లక్ష్మీదేవి సేదతీరుతూ ఉంటారు. ఆ సమయంలో తులసి మొక్కకి నీళ్లు పోయకూడదు. అదేవిధంగా పౌర్ణమి నాడు, అమావాస్య నాడు, సూర్య చంద్ర గ్రహణాల సమయంలో తులసి చెట్టుకి నీళ్లు పోయకూడదు. తులసి మొక్కకి ఎండిపోయిన ఆకులు ఎక్కువగా ఉన్నట్లయితే ఆ మొక్కని మీరు అక్కడి నుంచి తొలగించి, ఎవరు తిరగనిచోట వదిలేయండి. ఆ మొక్క స్థానంలో మరో మొక్కని నాటాలి. ఎందుకంటే ఎండిపోయిన తులసి మొక్క ఇంట్లో ఉంటే అది అశుభం. ఆదివారం, ఏకాదశి రోజుల్లో తులసి చెట్టుని పొరపాటున కూడా ముట్టుకోవద్దు. అలాగే నీళ్లు కూడా పోయకూడదు. కానీ ఆ రోజుల్లో తులసి మొక్కకి పూజ చేయడం చాలా ముఖ్యం. ఎంతో మేలు కలుగుతుంది. తులసి ఆకులని గోళ్ళతో గిల్లకూడదు. స్నానం చేయకుండా తులసి మొక్కని ముట్టుకోకూడదు. ఇటువంటి తప్పులు చేస్తే కుటుంబంలో చికాకులు వస్తూ ఉంటాయి.

 

Related Articles

ట్రేండింగ్

Tuni Assembly Constituency: తుని నియోజకవర్గంలో కూటమికి తిరుగులేదా.. యనమల కుటుంబానిదే విజయమా?

Tuni Assembly Constituency: తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గంలో కూటమిలో కాస్త ఆ నియోజకవర్గం సీటు ఎవరిదనే విషయంపై కాస్త గందరగోళం ఉండేది. అయితే పంపకాలలో తుని నియోజకవర్గం తెదేపాకి దక్కింది. ఈ...
- Advertisement -
- Advertisement -