Worship: నాగదేవతలను ఇలా పూజిస్తే ఆ దోషాలన్నీ పోతాయా.. సర్ప భయం కూడా తొలగిపోతుందా?

Worship: హిందువులు జరుపుకునే పండుగలలో నాగుల చవితి కూడా ఒకటి. ఈ నాగుల చవితి పండుగను కొందరు రెండు రోజులు చేసుకుంటే మరి కొందరు ఒక్కరోజు చేసుకుంటారు. ఈ రోజున స్త్రీలు ఉపవాసం ఉండి నాగదేవతకు పాలు సమర్పించి గుడ్లు పెట్టి చలివిడి వంటివి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల నాగదేవత ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. అయితే కేవలం నాగ పంచమి నాడే కాదు ఏడాదిలో ఎప్పుడైనా సరే మనం నాగ దేవతకు పూజలు చేయవచ్చు. అయితే నాగదేవతను ఎలా పూజించాలో తెలియక చాలా మంది సందేహిస్తుంటారు. నాగదేవతలను పూజించడం ద్వారా కొన్ని దోషాలు పోతాయట.

ఇంతకీ ఆ దోషాలు ఏంటి అన్న విషయానికి వస్తే.. ప్రతి ఏడాది శ్రావణ మాసంలో శుక్ల పక్షం 5వ రోజును నాగ పంచమిగా జరుపుకుంటారు. ఈ రోజు నాగదేవత విగ్రహాన్ని పాలతో అభిషేకం చేస్తారు. అలాగే పాములను కూడా పూజిస్తారు. నాగ పంచమి రోజు పాములను పూజిస్తే జాతకంలో ఉన్న కాల సర్ప దోషం తొలగిపోతుంది. నాగ పంచమి నాడు నాగ పూజ చేయడం వల్ల జాతకంలో ఉండే నల్ల పాము దోషాన్ని కూడా తొలగించుకోవచ్చు. నాగ పంచమి రోజు మంచి ముహుర్తం సాధారణంగా ఉదయాన్నే ఉంటుంది. ఆ కాలంలో నాగదేవతను పూజిస్తే అన్ని సర్ప దోషాలు తొలగిపోతాయి. అనుకున్నవి నెరవేరుతాయి. ముఖ్యంగా సంతానం లేని వారు ఇలా చేస్తే తప్పక ఫలితం ఉంటుంది. నాగ దేవతను చందనం, పువ్వులు, ధూపం, పచ్చిపాలు, పాయసం, నెయ్యితో పూజించాలి. అలాగే పేదలకు అన్నదానం చేస్తే చాలా మంచిది. ఆ అన్నదానంలో తీపి ఉండాలి.

 

అలాగే వారికి ఎంతో కొంత డబ్బు ఇస్తే ఇంకా మంచిది. ఇక రాశి చక్రంలో రాహు, కేతువుల కారణంగా వచ్చే దోషాన్ని కాల సర్ప దోషం అంటారు. ఇది పలు రకాలుగా ఉంటుంది. కానీ నాగ పంచమి నాడు కొన్ని పరిహారాలను పాటిస్తే కాల సర్ప దోషం నుంచి బయట పడవచ్చు. కాల సర్ప దోషాలు చాలా హానికరమైనవని చెప్పవచ్చు. ఇవి విపరీతమైన పరిణామాలను కలగజేస్తాయి. ముఖ్యంగా సంతానం ఉండదు. అలాగే తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఉంటాయి. మీ జాతకంలో కాల సర్ప దోషం ఉంటే నాగ పంచమి నాడు తప్పక పూజలు చేయాలి. అలాగే వీలు కుదిరినప్పుడు త్రయంబకేశ్వరం వెళ్లి పూజలు చేస్తే మంచిది. ఇక నాగ పంచమి నాడు శివుడికి రుద్రాభిషేకం చేస్తే మంచిది.

 

నాగ పంచమి నాడు వెండితో తయారు చేసిన పాములను దానం ఇవ్వాలి. దీంతో అంతా మంచే జరుగుతుంది. కాల సర్ప దోషం కూడా పోతుంది. సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి లేదా గరుడ గోవింద ఆలయానికి వెండితో చేసిన ఒక జాత నాగులను సమర్పించాలి. పంచాక్షరీ మంత్రం, మహా మృత్యుంజయ మంత్రాలను నాగ పంచమి నాడు 108 సార్లు జపించాలి. దీంతో సర్ప భయం పోతుంది. కాల సర్ప దోషం నుంచి గట్టెక్కుతారు. నాగపంచమి నాడు రాహువుకు చెందిన బీజ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. నాగ పంచమి నాడు అశోక వృక్షానికి పూజ చేసి నీరు పోయాలి. ఇది అత్యంత ఫలవంతమైన ఫలితాన్ని అందిస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -