Sravanamasam: శ్రావణమాసంలో ఈ దానాలు చేస్తే మీ కొంప కొల్లేరే.. ఈ తప్పులు చేయొద్దంటూ?

Sravanamasam: మరికొద్ది రోజులలో శ్రావణమాసం ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్క ఇంట్లోనూ దేవాలయంలోనూ పండగ వాతావరణం చోటు చేసుకుంటుంది ముఖ్యంగా శ్రావణమాసం అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనది కావడంతో ఈ నెల మొత్తం మహిళలు ప్రత్యేకంగా అమ్మవారికి పూజలు చేయడమే కాకుండా పెద్ద ఎత్తున వ్రతాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఇలా శ్రావణ మాసంలో ఏ ఆలయానికి వెళ్లిన మనకు పండగ శోభ కనబడుతుంది.

ఇక ఎంతో పవిత్రమైనటువంటి ఈ శ్రావణమాసం రోజు పొరపాటున కూడా కొన్ని రకాల దానాలు చేయకూడదని పండితులు చెబుతున్నారు.దానం చేయడం ఎంతో మంచిది అయితే శ్రావణ మాసంలో కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల తీవ్రమైనటువంటి ఆర్థిక సమస్యలను, ఇబ్బందులను, అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని పండితులు చెబుతున్నారు. మరి శ్రావణ మాసంలో ఏ విధమైనటువంటి వస్తువులను దానం చేయకూడదు అనే విషయానికి వస్తే…

 

శ్రావణమాసంలో ఎంతోమంది అమ్మవారిని ఆరాధ్య దైవంగా భావిస్తూ ఉంటారు. అయితే ఇలా లక్ష్మీదేవికి ఎంతో పవిత్రమైనటువంటి ఈ శ్రావణమాసంలో మహిళలు పొరపాటున కూడా ఎవ్వరికీ డబ్బును దానంచేయకూడదు ఎవరైనా డబ్బు సహాయం అడిగితే వారికి డబ్బు కాకుండా వస్తూ రూపంలో తినడానికి ఏదైనా దానం చేయడం మంచిది కానీ డబ్బును దానం చేయకూడదు. డబ్బుతో పాటు మరికొన్ని వస్తువులను కూడా దానం చేయకూడదు మరి ఆ వస్తువులు ఏంటి అనే విషయానికి వస్తే…

 

శ్రావణమాసంలో మనం ఇతరులకు ఎట్టి పరిస్థితులలో కూడా చీపురు, ఉప్పు, కారం, ఇనుము ఈ వస్తువులను ఎప్పుడు దానం చేయకూడదని పండితులు చెబుతున్నారు. వీటిని దానం చేయటం వల్ల తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అదేవిధంగా కుటుంబ సభ్యులు పలు అనారోగ్య సమస్యలకు గురికావాల్సి ఉంటుంది. అందుకే శ్రావణ మాసంలో ఈ దానాలను పొరపాటున కూడా చేయకూడదని పండితులు చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -