Intelligence: ఇవి తింటున్నారా.. తెలివి తేటలు మందగిస్తాయి తస్మాత్‌ జాగ్రత్త!

Intelligence: తెలివి తేటలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటాయి. వయస్సుకు తెలివి సంబంధం ఉండదు. చిన్న వయస్సులోనూ కొందరు చాలా తెలివిగా ఉంటారు. పలానా పదార్థాలు తింటే తెలివి తేటలు త్వరగా పెరగుతాయని కొందరు చెబుతుంటారు. అయితే తెలివి తేటలను పెంచే పదార్థాలతో పాటు తెలివితేటలను హరించే పదార్థాలు కూడా ఉంటాయి. వీటిని తినడంతో మెదడు ఆలోచన సామర్థ్యాన్ని మెల్లిమెల్లిగా కోల్పోతుంది. మెదడు,తెలివి తేటల మీద అమితమైన ప్రభావాన్ని చూపించే ఈ ఆహార పదార్థాలు సాధ్యమైనంత మేరకు తీసుకోరాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

తీపి పదార్థాలు, చక్కెరతో చేసిన పదార్థాలను, చాలా వరకు తగ్గించుకోవాలని సూచిస్తుంటారు. తీపి పదార్థాలు శరీర ఆరోగ్యాన్ని దెబ్బతీయడంతో మెదడు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. తీపి పదార్థాలు మెడదు పనితీరును నెమ్మదింపచేస్తాయి. అలాగే ఉప్పు లేనిదే ఏ ఆహార పదార్థమైన రుచి పచి ఉండదు. ఉప్పు లేని వంటకాలను ఊహించలేము. మనం తినే ఆహారంలో ఉప్పు కూడా భాగమైపోయింది. కానీ అమితమైన ఉప్పు ఆరోగ్యానికి చేటు చేస్తుంది. ఆహార పదార్థాల్లో ఎక్కువగా ఉప్పు తీసుకునే వారిలో గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందని తెలిసిందే.

మెడదు మీద కూడా ఉప్పు తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని ఇటీవల వెల్లడైన ఓ పరిశోధనలో స్పష్టమైంది. ఆలోచనా సామర్థ్యాన్ని ఉప్పు దెబ్బతీస్తుందని నిపుణులు చెబుతున్నారు. వాటితో పాటు మద్యం ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలేయ సంబంధిత వ్యాధులు వస్తాయని, ఆరోగ్యం దెబ్బతింటుందని అందరికీ తెలుసు. కేవలం ఆరోగ్యమే కాకుండా మద్యపానం వల్ల మెదడు కూడా దెబ్బతింటుదని తాజా పరిశోధనల్లో వెల్లడైంది. అంతేకాదు మద్యపానం వల్ల ఆలోచనల్లో చురుకుదనం పోతుందట. కాబట్టి మద్యం అలవాటును తగ్గించుకుంటే మంచిదని నిపుణులు అంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -