LipLock: లిప్ లాక్ సీన్ తర్వాత ఈ నటి చేసిన పని తెలిస్తే మత్రం నోరెళ్లబెట్టాల్సిందే!

LipLock: ఇదివరకటి రోజుల్లో సినిమాలలో లిప్ లాక్ సీన్లు అంటే చాలా కష్టం అని చెప్పవచ్చు. కానీ ఈ రోజుల్లో లిప్ లాక్ సన్నివేశాలు అన్నవి చాలా కామన్ అయిపోయాయి. హీరో హీరోయిన్లు కూడా చాలామంది ఈ లిప్ లాక్ సన్నివేశానికి పచ్చ జెండా ఊపేస్తున్నారు. కొంతమంది మాత్రమే అలాంటి సన్నివేశాలలో నటించడానికి సిద్ధంగా లేరు. ఇప్పుడంటే ఓకే కానీ ఒక ఇరవయ్యేళ్ల ముందు అంటే ఇండియన్ సినిమాల్లో ముద్దు సీన్లు తక్కువగా చూసేవాళ్లం. సినిమాలలో అంటే ఓకే కానీ ఒక సీరియల్లో లిప్ లాక్ అంటే పెద్ద షాక్ అని చెప్పవచ్చు. ఇకపోతే బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా చాలా ఏళ్ల కిందట ఒక సీరియల్లో ముద్దు సీన్ చేసిందట.

తనకు అది చాలా అసౌకర్యంగా ఉండటంతో సీన్ అయ్యాక డెటాల్ వేసి నోరు కడుక్కున్నట్లు ఆమె వెల్లడించింది. నీనా గుప్తా తాజాగా నటించిన చిత్రం లస్ట్ స్టోరీస్-2. ఇందులో ఆమె కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నీనా గుప్తా మాట్లాడుతూ.. ఒక నటిగా అన్ని రకాల సీన్ లు చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు బురదలోకి దిగాలి. కొన్నిసార్లు ఎర్రటి ఎండలో గంటల తరబడి నిలబడాలి. నేను కొన్నేళ్లు ముందు దిలీప్ ధావన్‌తో ఒక సీరియల్లో నటించాను. అందులో ఒక సన్నివేశంలో మాపై లిప్ టు లిప్ కిస్ సీన్ తీశారు.

 

భారత టెలివిజన్ చరిత్రలో అది మొదటి లిప్ లాక్ సీన్ అనుకుంటాను. నేను ఆ సీన్ చేశాక రాత్రంతా నిద్రపోలేదు. మేం పరిచయస్తులమే. అతను కూడా అందగాడే. కానీ దాంతో ఆ పరిస్థితులకు ఏమాత్రం సంబంధం లేదు. ఎందుకంటే నేను ఆ సీన్ చేయడానికి మానసికంగా, శారీరకంగా సిద్ధంగా లేను. ఆ సీన్ చేయడానికి నేను చాలా కంగారు పడ్డా. కొంతమంది కామెడీ చేయలేరు. కొందరు కెమెరా ముందు కన్నీళ్లు పెట్టుకోలేరు అంటూ నాకు నేను నచ్చజెప్పుకుని ఆ సీన్ చేశాను. కానీ ఆ సీన్ పూర్తయిన వెంటనే డెటాల్‌తో నోరు శుభ్రం చేసుకున్నాను. ఆ సీన్ నాకెంతో ఇబ్బందిగా అనిపించింది అని వెల్లడించింది మీనా గుప్తా. ఈ సందర్భంగా ఆమె చేసిన వాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -