మీ డబ్బుకు ఢోకా ఉండారాదంటే ఈ మొక్క నాటాలట!

మనం ఎంత కష్టపడి సంపాదిస్తామో.. అంతే కష్టంగా వాటిని కాపాడుకుంటాం. అయితే.. కొన్ని మొక్కలు మన ఇళ్లలో నాటినతే డబ్బులకు ఎలాంటి ఢోకా ఉండదని.. అలాంటి ఇళ్లలో సానుకూల శక్తి మొదలవుతోందని కొన్ని శాస్త్రలు చెబుతున్నాయి. ఈ ఒక్క మొక్కను ఇంట్లోనే నాటితే ఆదాయానికి సంబంధించిన సమస్యలు రావట. అంతేకాకుండా కోరికలన్నీ నెరవేరి మీరు ప్రతి రంగంలోనూ దూసుకెళ్తారని చెబుతున్నారు.

మనీ బెల్‌..

వాస్తుశాస్త్రం ప్రకారం, అపరాజిత(శంఖువు) తీగను క్రిష్ణ కాంత లేదా విష్ణుకాంత అని కూడా పిలుస్తారు. ఈ అపరాజిత మొక్కలు, ఆకులు రెండు రంగుల్లో ఉంటాయి. ఒకటి తెలుపు, రెండవది నీలి రంగు ఉంటాయి. ఆంగ్లంలో దీన్ని ‘మనీబెల్‌’ అని పిలుస్తారు. ఈ మొక్కలు మన ఇళ్లలో నాటినప్పటి నుంచి ఆ ఇళ్లలో సానుకూల శక్తి ప్రారంభమవుతుంది. ఆ మొక్క పెరిగే కొద్ది ఇంట్లో ఐశ్వర్యం కూడా పెరుగుతుందని నమ్మకం.

ఓటమి ఎరగదు..

మీ ఇంటి ఆవరణ, లేదా తోట ఉంటే అందులో నీలి రంగులోని అపరాజిత మొక్కను నాటండి. ఈ మొక్క సంపదతో పాటు లక్ష్మీదేవిని ఆకర్శిస్తోందట. అంతేకాకుండా నీలి రంగులోని అపరాజిత మొక్కను ఇంట్లో నాటడంతో కుటుంబ సభ్యుల మేధస్సు, తెలివితేటలు కూడా ఓ రేంజ్‌లో పెరుగుతాయట. ఈ పువ్వులతో విష్ణుమూర్తిని పూజిస్తే అసలు ఓటమి అనేదే ఉండదని నమ్ముతుంటారు. అలాగే శని భగవానుడికి కూడా నీలి రంగులోని అపరాజిత పువ్వులను సమర్పించడం వల్ల మీకు శని మహా దశ బాధ నుండి ఉపశమనం సిద్ధిస్తోంది.

సంతోషం కలిగి, దనలక్ష్మిని ఆకర్షిస్తోంది..

ఇళ్లలో అపరాజిత మొక్కను నాటడం వల్ల ఇప్పటి గతంలో మనం ఎదుర్కొన్న సమస్యల నుంచి ఉపశమనం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇందులోని తెలుపు రంగు మొక్క ధనలక్ష్మిని ఆకర్షిస్తుంది. ఇది మన ఇంట్లో ఉన్నంత సేపు సంతోషం, ప్రశాంతత నెలకొటాయి. ఆహార ధాన్యాల వంటి వాటికి లోటు అనేదే ఉండదు.

మొక్క నాటే విధానం ఇలా..

శాస్త్రం ప్రకారం, ఈ తీగను మీ ఇంటికి ఉత్తర దిశలో నాటడంతో ఎన్నెన్నో ప్రయోజనాలు మీ దరికి చేరుతాయి. ఇలా చేయడంతో మీకు శుభ ఫలితాలు వస్తునే ఉంటాయి. మీ ఇంట్లో నిరంతరం శాంతి, ఆనందం ఉంటాయి. అయితే ఈ తీగను పశ్చిమ, లేదా దక్షిణ దిశలో అస్సలు నాటరాదు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -