Annatto Seeds: ఈ గింజలు తీసుకుంటే ఆరోగ్యానికి ఏకంగా ఇంత లాభమా.. ఆ సమస్యలకు చెక్ పెట్టవచ్చా?

Annatto Seeds: అన్నట్టో విత్తనాల గురించి పెద్దగా ఎవరు విని ఉండరు. అన్నట్టో విత్తనాల వలన చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఈ విత్తనాల నుంచి ప్రకృతి పరంగా హాని లేకుండా రంగులను సేకరించి ఆహార పదార్థాలకు కలుపుతారు. ఈ విత్తనాలను నానబెట్టి మెత్తగా రుబ్బుకొని మిశ్రమముగా చేసుకోవాలి. ఈ పేస్ట్ ని ఆహార పదార్థాలలో కలుపుకోవటం వలన ఎరుపు, గులాబీ, పసుపు వంటి రంగులుగా చేసుకోవచ్చు. ఈ విత్తనాలను ఆహారంగా చేసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.

ఈ విత్తనాలలో క్యాల్షియం, ఐరన్, విటమిన్ ఏ, పోలిక్ యాసిడ్, పీచు పదార్థాలు ఉంటాయి. గ్యాస్టిక్, జ్వరం, ఉబ్బసం, ఆయాసం, జీర్ణ సంబంధిత సమస్యలు, అతిసార వ్యాధి వంటి సమస్యల బారిన పడకుండా ఈ విత్తనాలు మనల్ని కాపాడతాయి. బిపి, షుగర్ ఉన్నవారికి క్రమంగా కంటిచూపు తగ్గుతూ వస్తుంది. కంటి లోపల ఉండే రెటీనా పొర లోపల ఉండే రక్తనాళాలు ఉబ్బడం వలన చూపు తగ్గుతుంది. అన్నట్టో విత్తనాలు రెటినోపతిని తగ్గించడానికి అద్భుతంగా సహాయపడతాయి.

గర్భవతులకు గర్భం లోపల ఎదుగుతున్న పిల్లల అవయవ లోపాలను సరిచేస్తుంది. అన్ని అవయవాలు సక్రమంగా ఏర్పడటానికి ఈ విత్తనాలు ఎంత ఉపయోగపడతాయి. అలాగే వృద్ధాప్య ఛాయలు త్వరితగతిన రాకుండా కాపాడుతుంది. వృద్ధాప్యంలో వెంట్రుకలు తెల్లబడతాయి అదే ఈ విత్తనాలు తీసుకుంటే వెంట్రుకలు తెల్లబడకుండా నల్లగా నిగనగలాడుతూ ఉంటాయి అలాగే రే చీకటిని కూడా నివారించడంలో ప్రధాన పాత్ర వహిస్తాయి.

ఈ అన్నట్టో విత్తనాలు, గాయాలు ఏమైనా అయినా కూడా అవి త్వరగా మానిపోయేలాగా చేయడానికి ఈ విత్తనాలు సహాయ పడతాయి. విత్తనాలను మెత్తగా పేస్ట్ చేసి ఆ మిశ్రమాన్ని గాయాలు అయిన చోట రాయటం వలన మానిన గాయం తాలుకా మచ్చలు కూడా పోతాయి. గ్యాస్ ట్రబుల్ ఉన్నవారు ఈ విత్తనాలను తీసుకోవడం వలన పుల్లని తేనుపులు రాకుండా ఎసిడిటీ సమస్యను తగ్గిస్తుంది. శరీరంలో ఫ్రీ రాడికల్స్ తగ్గించి క్యాన్సర్ రాకుండా చేస్తుంది. వీటి వలన ఇంకా చాలా లాభాలు ఉన్నాయి. ఈ విత్తనాలని ఔషధాల గని అనటంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -