VIP Vehicles: వీఐపీ వాహనాలలో సైరన్ కు బదులుగా భారతీయ సంగీతం.. కొత్త పాలసీతో పండగేనా?

VIP Vehicles: ఎన్నో సంవత్సరాల నుంచి గవర్నమెంట్ వెహికల్ కి వస్తున్నా సైరన్ సౌండ్ ఇకపై వినిపించదేమో.. ఎందుకంటే అలాంటి సైరన్ మూలంగా శబ్ద కాలుష్యం ఎక్కువ అవుతుందని అందుకే వాటి స్థానంలో కొత్త సౌండ్స్ ని ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తుంది. శబ్ద కాలుష్యాన్ని తగ్గించి వీఐపీ వాహనాలపై పెద్ద శబ్దంతో కూడిన సైరన్ స్థానంలో ఓదార్పు నిచ్చే సౌండ్ లను అమర్చాలని ప్రభుత్వం యోచిస్తోంది.

సైరన్ శబ్దాల స్థానంలో వేణువు, తబలా, శంఖం వంటి భారతీయ సంగీత వాయిద్యాలు ధ్వనితో కొత్త విధానాన్ని రూపొందిస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ప్రోటోకాల్ లో భాగంగా వీఐపీ వాహనాలకు సైరన్ ఉంటుంది. ఆ సైరన్ విన్న వెంటనే ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ట్రాఫిక్ ని క్లియర్ చేస్తారు. అయితే ఈ సైరెన్ ని చాలామంది దుర్వినియోగం చేస్తున్నారు అంటూ నితిన్ ఇలా చెప్పుకొచ్చారు. పూణేలోని చాందినీ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న నితిన్ గడ్గరీ ఈ విషయాన్ని వెల్లడించారు.

 

వీఐపీ వాహనాలపై ఉండే ఎర్రబుగ్గ సంస్కృతికి ముగింపు పలికే అవకాశం నాకు లభించింది. ఇప్పుడు వీఐపీ వాహనాల్లో సైరన్ కూడా తొలగించాలనుకుంటున్నాము. సైరన్ కి ఇబ్బందులు సంగీత వాయిద్యాలు అయిన పిల్లనుగ్రోవి,తబలా, వయోలిన్ వంటి శబ్దాలు వినబడేలాగా మార్పులు చేసేందుకు నిబంధనలు సిద్ధం చేస్తున్నాము. ప్రజలను కాలుష్యం నుంచి ఉపశమనం కలిగించటమే దీనిని ముఖ్య ఉద్దేశం అంటూ చెప్పుకు వచ్చారు నితిన్ గడ్గరీ.

 

అలాగే చాందిని చౌక్ లో నిర్మించిన మల్టీ లెవెల్ ఫ్లై ఓవర్ ని మంత్రి శనివారం ప్రారంభించారు. చాందిని చౌక్ ఫ్లైఓవర్ ప్రాజెక్టు పూనే నగరంలో ట్రాఫిక్ ని తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు గడ్గరీ తెలిపారు. అయితే ఇకపై రోడ్లమీద హారన్ సౌండ్ ల మోత కాకుండా శ్రావ్యమైన సంగీతం వినబడబోతుందన్నమాట. చూడాలి మరి శబ్ద కాలుష్యం ఏ మాత్రం తగ్గుతుందో

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -