Benefits of Walking Barefoot: ఏడు రోజులకు ఒకసారైనా కిలోమీటర్ చెప్పులు లేకుండా నడవాలా.. అలా చేస్తే ఇన్ని లాభాలా?

Benefits of Walking Barefoot:  కాలం మారిపోవడంతో మనుషుల జీవన శైలి పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు బయటకు వెళ్లాలి అంటే చెప్పులు వేసుకుని వెళ్లేవారు. కానీ ప్రస్తుత రోజుల్లో చెప్పులు వేసుకుని ఇల్లు మొత్తం తిరుగుతున్నారు. పెద్ద పెద్ద కోటీశ్వరులు అయితే కనీసం బెడ్ రూమ్ లో నుంచి బయటికి రావాలి అన్న కూడా చెప్పులు ఉండాల్సిందే. ఉదయం బెడ్ మీద నుండి దిగింది మొదలు మళ్లీ రాత్రి బెడ్ మీద పడుకునే వరకు కాళ్లను మాత్రం ఖాళీగా ఉంచే పరిస్థితే లేదు. వీలైతే స్లిప్పర్లు, లేకుంటే శాండిల్స్, కాకుంటే స్పోర్ట్స్ షూస్ ఇంకా అయితే ఫార్మల్ షూస్ ఇలా ఆ సమయాన్ని బట్టి ఏదో ఒక పాదరక్షలను బిగించి మరీ మన పాదాల్ని కప్పేస్తున్నాం.

అయితే ఇది ఏమాత్రం ఒంటికి మంచిది కాదు. కానీ పూర్వీకులు మాత్రం రాళ్లు, రప్పలు లెక్క చేయకుండా ఆ ముళ్ళను కూడా లెక్కచేయకుండా చెప్పులు లేకుండా తిరిగేవారు. అది ఒకప్పుడు ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇంట బయట చెప్పులు వేసుకొని పాదాలను రక్షిస్తున్నామని అనుకుంటున్నాం కానీ శరీరానికి శిక్ష వేసుకుంటున్నామని చాలామందికి తెలియదు. కాబట్టి ఇక మీదట అయినా వారానిని ఒకసారి ఒక కిలోమీటర్ దూరం చెప్పుల్లేకుండా నడిచే ప్రయత్నం చేయాలి. లేకుంటే మీ ఆరోగ్యం డేంజర్ లో పడుతుందట. వారానికి క‌నీసం ఒక కిలోమీట‌ర్ దూరం అయినా స‌రే చెప్పులు లేకుండా న‌డ‌వ‌డం వ‌ల్ల అనేక లాభాలు క‌లుగుతాయి. చెప్పులు లేకుండా త‌ర‌చూ న‌డ‌వ‌డం వ‌ల్ల పాదాల్లో ర‌క్త ప్ర‌స‌ర‌ణ మెరుగు ప‌డుతుంది.

పాదాల్లో 72వేల నాడుల కొన‌లు ఉంటాయి. ఈ క్ర‌మంలో చెప్పులు లేకుండా న‌డిస్తే ఆ కొన‌ల‌కు గ‌రుకుద‌నం త‌గులుతుంది. ఇది నాడుల‌ను ఉత్తేజ ప‌రుస్తుంది. ఇలా ఆక్యుప్రెష‌ర్ అవుతుంది. ఫ‌లితంగా నాడులు యాక్టివేట్ అవుతాయి. దీంతో అనేక వ్యాధుల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. చెప్పులు లేకుండా న‌డ‌వ‌డం వ‌ల్ల శరీర భంగిమ సరిగ్గా ఉంటుంది. రోజూ గంట‌ల త‌ర‌బ‌డి కంప్యూట‌ర్ల ఎదుట కూర్చుని ప‌నిచేసే వారికి ఇది ఎంత‌గానో మేలు చేస్తుంది. అలాగే పొత్తి కడుపుపై ఒత్తిడి కలిగి జీర్ణ క్రియ సక్రమంగా ఉంటుంది. నేల మీద చెప్పులు లేకుండా నడవడం ద్వారా ఇసుక, చిన్న చిన్న రాళ్లు కాళ్లకు సుతిమెత్తగా గుచ్చుకోవడం ద్వారా మీ బీపీ కంట్రోల్ అవుతుంది. ఏదో కొత్త స్పర్శను కాలి పాదాలు పొందడం వల్ల మైండ్ రిలాక్స్ అవుతుంది. రక్తప్రసరణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. సహనం పెరుగుతుంది. ఎక్కువసేపు పాదరక్షలు వాడటం వల్ల సున్నితమైన పాదాల కొన‌ల నరాలు చచ్చుబడిపోతాయి. చెప్పుల్లేకుండా నడవడం వల్ల అవి యాక్టివ్ గా ఉంటాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -