Ginger: అల్లం అతిగా తింటే అంత ప్రమాదమా?

Ginger: ప్రతి ఒక్క వంటింట్లో ఉండే దివ్య ఔషధాలలో అల్లం కూడా ఒకటి. అల్లం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం తెలిసిందే. అల్లంని కూరలలో వినియోగిస్తూ ఉంటారు. అల్లం జీర్ణ సమస్యలతో పాటు, జలుబు దగ్గు లాంటి సమస్యలకు కూడా చక్కటి పరిష్కారంగా పనిచేస్తుంది. అలాగే వికారంగా వాంతులుగా ఉన్నా కూడా అల్లం అటువంటి వాటికీ చెక్ పెట్టేస్తుంది. అలాగే దంత సమస్యలు, నోటి దుర్వాసనతో బాధపడుతున్న వారు అల్లాన్ని తినడం వల్ల ఎంతో మేలు చేస్తుంది. అల్లంలో సహజ సిద్ధమైన యాంటీ ఇంప్లమెంటరీ గుణాలు ఉంటాయి.

అల్లం వల్ల కీళ్ల నొప్పులు,వాపులు తదితర సమస్యలకు బాగా ఉపయోగపడుతుంది. ఇతర సీజన్ లతో పోల్చుకుంటే చలికాలంలో అల్లం ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. కాగా రుచికే, ఆరోగ్యానికి అల్లం మంచిదే. కానీ అల్లం అతిగా తీసుకుంటే మాత్రం ఆరోగ్యానికి హాని చేకూరుతుంది. అల్లం కొన్ని వ్యాధుల్ని ఎలా దూరం చేస్తుందో అదే విధంగా కొన్ని వ్యాధులకు కారణమౌతుంది. మరి అల్లం ఎక్కువగా తినడం వల్ల కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.అల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. రోజుకు కేవలం 5 గ్రాముల వరకే అల్లం తీసుకోవచ్చు.

 

అంతకంటే ఎక్కువ అల్లం తీసుకోవడడం వల్ల చాలా సమస్యలు ఎదురౌతాయి. అల్లం అతిగా తీసుకోవడం వల్ల పలు అనారోగ్య సమస్యలు, వ్యాధుల ముప్పు పెరుగుతుంది. అల్లంలో రక్తాన్ని పలుచన చేసే గుణముంటుంది. ఎక్కువగా అల్లం తీసుకోవడం వల్ల లేదా అల్లం టీ తాగడం వల్ల లో బీపీ ముప్పు వెంటాడుతుంది. ఇందులో ఉండే ఎలిసిన్ బ్లడ్ ప్రెషర్‌ను తగ్గిస్తుంది. అల్లంతో ఎసిడిటీ సమస్య తలెత్తుతుంది. అల్లం ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సంబంధిత సమస్యలు ఉత్పన్నమౌతాయి. ఫలితంగా ఎసిడిటీ వస్తుంది. దాంతో ఛాతీలో మంట సమస్య ఏర్పడుతుంది. అల్లం గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ లేదా ప్రేవుల సమస్యకు కారణం కావచ్చు. గర్భిణీ మహిళల ఆరోగ్యం కోసం అల్లం ఎక్కువగా తీసుకోవడం నష్టదాయకం కాగలదు. అల్లం అతిగా తీసుకుంటే కడుపు నొప్పి సమస్య ఉత్పన్నమౌతుంది. అంతేకాకుండా గర్భిణీ మహిళల గర్భంపై కూడా ప్రభావం పడవచ్చు.అల్లం బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను తగ్గిస్తుంది. హైపో గ్లైసీమియాకు కారణం కావచ్చు. ఒకవేళ మీకు లో షుగర్ ఉంటే అల్లం అతిగా తీసుకోవద్దు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -