Rangoli: ఇంటి ముందు ముగ్గు వేయకపోతే ఇంత నష్టమా.. ముగ్గు వేయడం వెనుక ఇంత అర్థం ఉందా?

Rangoli: భారతదేశంలో హిందువులు ఉదయాన్నే సూర్యోదయానికే ముందు నిద్రలేచి కల్లాపు చల్లి ఇంటి ముందు ముగ్గుపెడుతూ ఉంటారు. ఆవుపేడతో అలికి బియ్యపు పిండితో ముగ్గులు పెడుతూ ఉంటారు. ఇంటా బయటా చెత్తాచెదారం లేకుండా తుడుచుకొని నీళ్లు చల్లి, ముగ్గు పెట్టుకోవాలని కూడా చెబుతూ ఉంటారు. మరి మన పెద్దలు చెప్పారు కదా అని పాటించడం పక్కన పెడితే అసలు ఇంటి ముందు ముగ్గు ఎందుకు వేయాలి అలా వేయడం వెనుక ఉన్న అంతర్యం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఇంటి గడప ముందు ముగ్గుల‌లో భాగంగా 2 గీతల్ని గీస్తూ ఉంటారు. అయితే, ఇలా గీయడం వలన దుష్టశక్తులు రావట. పైగా ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోకుండా ఉంటుంది. ముగ్గు వేసి నాలుగు వైపులా కూడా రెండేసి అడ్డగీతలు గీస్తూ ఉంటారు. అలా చేయడం వలన శుభకార్యాలు, మంగళకరమైన పనులు జరుగుతాయట. పండుగల సమయంలో కచ్చితంగా ఇలా ముగ్గు వేసి, అడ్డగీతలు గీయాలి. ఏ పూజ చేసుకున్నా కూడా ముందు పీట మీద దేవతని పెట్టేటప్పుడు, ముగ్గు వేయాలి. నాలుగు వైపులా రెండేసి అడ్డగీతలు గీసుకోవాలి. నక్షత్ర ఆకారంలో వచ్చే గీతాలతో వేసిన ముగ్గు భూత, ప్రేత, పిశాచాలని తొలగిస్తుంది. ఇవేమి మీ దరిదాపుల్లోకి రాకుండా చేస్తుంది.

 

మనం పద్మాన్ని, చుక్కల ముగ్గులు కూడా వేస్తూ ఉంటాము. వాటిలో అనేక కోణాలు ఉంటాయి. అవి గీతలే కాదు. యంత్రాలు కూడా. యంత్ర, తంత్ర, శాస్త్ర రహస్యలతో కూడి ఉండడం వలన మనకి ఎటువంటి చెడు శక్తులు కలగకుండా, మనకి ఎలాంటి హాని కూడా కలగకుండా అవి చేస్తాయి.

 

అందుకే ముగ్గుని తొక్కకూడదని చెబుతూ ఉంటారు. తులసి మొక్క దగ్గర అయితే, అష్టదళ పద్మం వేసి, దీపారాధన చేస్తే మంచిది. నూతన వధూవరులు మొదటిసారి భోజనం చేసేటప్పుడు, చుట్టుపక్కల లతలు, పుష్పాలు, తీగలతో ఉన్న ముగ్గులను వేయాలి. ఓం, స్వస్తిక్, శ్రీ వంటి కలిగిన ముగ్గులు వెయ్యద్దు. ఎందుకంటే వాటిని అస్సలు తొక్కకూడదు. ఏ స్త్రీ అయితే దేవాలయంలో అమ్మవారు, శ్రీమహావిష్ణువు ముందు నిత్యం ముగ్గులు వేస్తుందో, ఆమెకి ఏడు జన్మల వరకు వైధవ్యం ఉండదు. సుమంగళిగానే చనిపోతుందట..

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -