Cough: ఆ దగ్గు మందే చిన్నారుల ప్రాణాలు తీస్తోందా.. ఏం జరిగిందంటే?

Cough: మధ్య ఆఫ్రికా దేశమైన కామెరూన్ లో గత కొంతకాలంగా పిల్లలు వరుసగా మరణిస్తున్నారు. ఇలా పిల్లలు వరుసగా మరణించడంతో పెద్దఎత్తున ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. అయితే ఇలా చిన్న పిల్లలలో వరస మరణాలు సంభవించడానికి గల కారణం ఏంటి అని ఆరా తీయడంతో చిన్న పిల్లలకు ఇస్తున్నటువంటి దగ్గు మందే కారణమని తెలుస్తుంది. అయితే ఆ ఔషధం మన ఇండియాలోనే తయారైనదిగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 

ఈ దగ్గు మందు తయారుచేసిన తయారీ సంస్థ నెంబర్ భారతదేశం నుంచి సంబంధించిన ఓ తయారీ సమస్తకి పోలికలు సంబంధం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే గత కొద్ది రోజులుగా ఈ ప్రాంతానికి చెందినటువంటి 12 మంది చిన్నారులు మరణించారు. ఇక వీరి మరణానికి కారణం నేచర్ కోల్డ్ అనే దగ్గు మందు కారణమని తెలుస్తుంది.

ఈ క్రమంలోనే ఈ వ్యవహారపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అలాగే ఈ దగ్గు మందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలపై ఎక్కడ కూడా తయారీదారుల పేరు లేకపోవడం గమనార్హం.కేవలం తయారీదారి కంపెనీకి చెందిన లైసెన్స్ నెంబర్ మాత్రమే ఉంది అయితే ఈ లైసెన్స్ నెంబర్ భారతదేశానికి చెందిన కంపెనీదని తెలుస్తుంది.

 

ఇక ఈ విషయంపై రీమాన్ డైరెక్టర్ నవీన్ భాటియా స్పందించారు.అది తమ సంస్థ తయారు చేసిన ఔషధంలాగే కనిపిస్తుంది అంటూ ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే ఇది పక్కాగా మా సంస్థ తయారు చేసినదనేది మాత్రం స్పష్టతగా తెలియజేయలేము. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క కంపెనీకి ఎన్నో నకలే కంపెనీలు తయారవుతున్నాయని, మా కంపెనీ ఉత్పత్తి చేసే మందుల నాణ్యత విషయంలో మేము రాజీ పడమని ఈయన స్పష్టత ఇచ్చారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -