Nitya Menen: నిత్యామీనన్ పై అక్కడ చేతులేసిన స్టార్ హీరో ఇతనేనా?

Nitya Menen: తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ హీరోయిన్ నిత్యామీనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నిత్యా మీనన్ నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. మొదట అలా మొదలైంది సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ అది తక్కువ సమయంలోనే భారీగా బాపులారిటీని సంపాదించుకుంది. ఇప్పటివరకు నిత్యామీనన్ ఎక్కువగా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను చేస్తూ వచ్చింది.

 

తెలుగులో గుండెజారి గల్లంతయ్యిందే, ఇష్క్, గీతా గోవిందం, సన్నాఫ్ సత్యమూర్తి, భీమ్లా నాయక్ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక చివరిగా భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా కోలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటించిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా నిత్యామీనన్ కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నిత్యామీనన్ షాకింగ్ విషయాలను వెల్లడించింది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. కోలీవుడ్లో సినిమాలు చేస్తున్నప్పుడు ఒక స్టార్ హీరో తనతో మిస్ బిహేవ్ చేశాడట.

తనను తాకరాని చోట తాకుతూ ఇబ్బంది గురి చేసాడని, అప్పటి నుంచి సినిమాలంటే నాకు విరక్తి వచ్చిందని ఆమె తెలిపింది. అప్పటినుంచి సినిమా షూటింగ్ కి వెళ్లాలన్న నాకు అసహ్యం వేసిందంటూ తనకు జరిగిన అవమానాన్ని గురించి ఓపెన్ అప్ అయ్యింది. ఏ పరిశ్రమలో అయినా మహిళలకు స్వేచ్ఛ ఇవ్వకపోతే ఎవరూ రాణించలేరు. అంతేకాకుండా సమాజం కూడా ముందుకెళ్లదు అంటూ కాస్త ఘాటుగా స్పందించింది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నిత్యామీనన్‌తో అంత అసభ్యంగా ప్రవర్తించిన హీరో ఎవరా? అంటూ చర్చించుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -