Aditya L1: ఇస్రో ఆదిత్య ఎల్1 సక్సెస్.. ప్రతి భారతీయుడు మరోసారి గర్వంగా మీసం మెలేయాలంటూ?

Aditya L1: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చంద్రయాన్ 3 చంద్రుడు పైకి పంపించి ఎంతో మంచి విజయం అందుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా చంద్రయాన్ 3 సక్సెస్ కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలపై ప్రశంసల వర్షం కురిపించడమే కాకుండా ఇది దేశానికి ఎంతో గర్వకారణం అని చెప్పాలి ఇలా చంద్రయాన్ 3 సక్సెస్ కావడమే కాకుండా మరో అడుగు ముందుకు వేసి ఇస్రో శాస్త్రవేత్తలు సూర్యుడిపై ప్రయోగంలో భాగంగా ఆదిత్య ఎల్ 1 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపించారు.

ఈ విధంగా ఆదిత్య ఎల్ 1 ఉపగ్రహం నింగిలోకి విజయవంతంగా దూసుకుపోవడంతో శాస్త్రవేత్తలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రీహరికోట స్పేస్ సెంటర్ లో సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆదిత్య ఎల్ 1 సక్సెస్ అయిందని, నిర్దేశించిన కక్షలోకి ఈ ఉపగ్రహాన్ని పిఎస్ఎల్వి ప్రవేశపెట్టిందని తెలిపారు. ఇక ఇది వాహన నౌక నుంచి ఉపగ్రహం విడిపోయిందని చైర్మన్ సోమనాథ్ తెలియజేశారు.

నింగిలోకి ప్రవేశపెట్టినటువంటి ఈ ఆదిత్య ఎల్ 1 ఉపగ్రహం బరువు సుమారు 1475 కిలోలు ఉందని తెలిపారు.ఈ ఉపగ్రహ జీవితకాలం ఐదు సంవత్సరాలని తెలిపారు. ఈ ఐదు సంవత్సరాల కాలంలో సౌర తుఫానులు, జ్వాలలు తీరు తెన్నులపై పరిశోధనలు చేయబోతున్నట్లు తెలిపారు. ఇక ఈ ఉపగ్రహం ప్రతిరోజు 1440 ఫోటోలను తీసి భూమికి పంపించడమే కాకుండా ఫిబ్రవరి నెల నుంచి నిరంతరం డేటా చేరవేస్తుందని తెలిపారు. ఇక ఈ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపించడం కోసం 378 కోట్లు ఖర్చు అయిందని చైర్మన్ తెలియజేశారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -