Radhakrishna: వివేకా కేసులో జగన్ దంపతుల ప్రమేయం.. ఆర్కే షాకింగ్ కామెంట్స్!

Radhakrishna: వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ వేగవంతంగా దర్యాప్తు చేస్తున్న క్రమంలో సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే సిబిఐ అధికారులు పలువురు వైఎస్ఆర్సిపి నేతలను పెద్ద ఎత్తున విచారణ చేపడుతున్నారు. అయితే ఈ కేసులో జగన్ భారతీ దంపతులకు కూడా హస్తము ఉందంటూ ఆర్కె తన కొత్త పలుకులు ద్వారా సిబిఐకి సమాచారాన్ని చేరవేశారు. ఇలా కొత్త పలుకులు అనే కార్యక్రమంలో భాగంగా నలుగురుతో తాను ఇంటర్వ్యూ చేశానని తెలిపారు.

ఆ నలుగురిలో ఒకరు వివేక హత్య కేసులో జగన్ భారతి హస్తం కూడా ఉందని చెప్పినట్లు ఆర్కే వార్తలు రాశారు. మరి ఈయన కొత్త పలుకులు కార్యక్రమంలో పాల్గొన్న ఆ నలుగురు ఎవరు అనే విషయానికి వస్తే..ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, దువ్వూరి కృష్ణ, పీఏ కృష్ణమోహన్ రెడ్డి, మాజీ సీఎస్ అజేయ కల్లాం. ఈ నలుగురిని సీబీఐ విచారిస్తేవివేక హత్య వెనక ఎవరు ఉన్నారో అర్థమవుతుందని ఈయన కొత్త పలుకులు కార్యక్రమం ద్వారా సిబిఐ వారికి సరికొత్త ఇన్ఫర్మేషన్ అందించారు.

 

ఇందులో ఒకరు తనతో మాట్లాడుతూ వివేకానంద రెడ్డి హత్య జరిగిన విషయం తెల్లవారుజామున 4:30లకు జగన్ భారతీ దంపతులకు తెలుసని ఆర్కే కామెంట్ చేశారు. అయితే ఆర్కే ఇలా కామెంట్ చేయడం చూస్తుంటే ఈ హత్యలో జగన్ దంపతులకు కూడా కుట్ర ఉందని ఈయన చెప్పకనే చెప్పేశారు. ఇక ఈ నలుగురిని విచారిస్తే అసలు విషయం బయట పడుతుందని తెలిపారు.

 

ఇందులో కృష్ణమోహన్ రెడ్డిని ఇప్పటికే సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఎందుకంటే ఆయన ఫోన్‌కే అవినాష్ రెడ్డి ఫోన్ చేసి మాట్లాడారు. మిగతా ముగ్గురిని కూడా విచారించాలని కోరారు. ఇక ఆర్కె ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో అసలు విషయం ఆర్కేకు ఎవరు లీక్ చేసి ఉంటారన్నది కూడా ఇప్పుడు జగన్ క్యాంప్‌కు టెన్షన్. ఈ నలుగురిని సీబీఐ ప్రశ్నిస్తుందా లేదా అన్నది తర్వాత విషయం అయినప్పటికీ వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్ భారతీయుల ప్రేమే ఉందని ఇలా ఆర్కే గట్టిగా తన కొత్త పలుకులు ద్వారా వెల్లడిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -