Jagan Vs Sowmya: నందిగామ నియోజకవర్గంలో ఉత్కంఠ పోరు.. జగన్ వర్సెస్ సౌమ్య పోటీలో గెలుపు ఎవరిదంటే?

Jagan Vs Sowmya: టిడిపికి కంచు కోటగా ఉన్నటువంటి నియోజకవర్గాలలో నందిగామ నియోజకవర్గం ఒకటి ఇక్కడ గత నాలుగు దశాబ్దాలుగా కేవలం రెండు సార్లు మాత్రమే ఇతర పార్టీలు ఆధిపత్యం చెలాయించాయి. మిగిలి అన్ని ఎన్నికలలో టిడిపి ఆధిపత్యం చెలాయించింది. కృష్ణాజిల్లాలు కీలక నియోజకవర్గం అయినటువంటి నందిగామ గత ఎన్నికలలో భాగంగా జగన్మోహన్ రావుకు టికెట్ ఇచ్చి అఖండ మెజారిటీతో గెలిపించారు. అయితే ఈయన నాలుగు సంవత్సరాల కాలంలో నియోజకవర్గ పరిధిలో భారీ స్థాయిలో అభివృద్ధి పనులను నిర్వహించారు.

ఇలా ఈయన పనితీరు చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి రెండోసారి కూడా ఆయనకి అవకాశం ఇచ్చారు అయితే గత ఎన్నికలలో జగన్ మోహన్ రావు టీడీపీ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పై భారీ మెజారిటీతో గెలిచారు. ఈ క్రమంలోనే రెండోసారి కూడా అక్కడే తమ పార్టీ విజయకేతనం ఎగరేయాలని మొండితోక జగన్మోహన్ రావు భావిస్తున్నారు.

నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు అలాగే సంక్షేమ పథకాల ప్రభావం తప్పకుండా తమను మరోసారి అధికారంలో కూర్చోబెడుతుందని విశ్వసిస్తున్నారు. అయితే మరోవైపు ఈయనకు పోటీగా తంగిరాల సౌమ్యకు టికెట్ ఇచ్చారు. గత ఎన్నికలలో కూడా ఈమె పోటీ చేసి ఓడిపోయారు కానీ ఇప్పుడు కూడా తనకే టికెట్ ఇవ్వడమే కాకుండా గతంలో ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేస్తున్నటువంటి దేవినేని ఉమాకు కొన్ని బాధ్యతలను అప్పగించి ఈ నియోజకవర్గంలో సౌమ్య గెలుపుకు దోహదపడాలని తెలిపారు.

ఈయనకు ఉన్నటువంటి పరిచయాలు కారణంగా టిడిపికి మరింత బలం చేకూరుతుంది. అంతేకాకుండా వైసిపిలో ఉన్నటువంటి వసంత నాగేశ్వరరావు కుటుంబం కూడా ఇప్పుడు టీడీపీలో చేరడంతో నందిగామలో తమ బలం పెరిగిందని భావిస్తోంది. ఈ క్రమంలోనే ఈ ఇద్దరి మధ్య భారీ స్థాయిలో పోటీ ఉందని చెప్పాలి. మరి ఈ పోటీలో విజయం ఎవరిది అనేది తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -