Jeans: ఉదయం నుంచి రాత్రి వరకు జీన్స్.. అనారోగ్యం కొని తెచ్చుకున్నట్లే?

Jeans: ఈ మధ్య కాలంలో చిన్న పెద్ద, ఆడ మగ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా జీన్స్ దుస్తులను ధరిస్తున్నారు. జీన్స్ ప్యాంట్లు జీన్స్ షర్ట్లు ఎక్కువగా ధరిస్తున్నారు. స్త్రీలతో పోల్చుకుంటే పురుషులు ఎక్కువగా ఈ జీన్స్ ప్యాంట్ లను ధరిస్తూ ఉన్నారు. చాలామంది పురుషులు పగలంతా ఆ జీన్స్ ప్యాంటు లతో అలాగే ఉండటంతో పాటు రాత్రి పడుకునే సమయంలో కూడా జీన్స్ ప్యాంట్ తో అలాగే పడుకుంటూ ఉంటారు. అయితే అలా చేయడంవల్ల అనారోగ్య సమస్యలు తప్పవు అంటున్నారు నిపుణులు. అమ్మాయిలైనా అబ్బాయిలైనా రాత్రి సమయంలో నిద్రించే ముందు కేవలం వదులుగా ఉన్న దుస్తులను మాత్రమే ధరించాలి.

అప్పుడే నిద్ర బాగా పడుతుంది. లేదంటే టైట్ గా ఉండే జీన్స్ షర్ట్లు వేసుకొని పడుకోవడం వల్ల కోరి మరి అనారోగ్యం తెచ్చుకున్నట్లు. జీన్స్ డెనిమ్ ఫ్యాబ్రిక్‌తో తయారవుతుంది. కాగా జీన్స్ కి ఉపయోగించే క్లాత్ గాలి కూడా చొరబడనంత దట్టంగా ఉంటుంది. చెమట పీల్చుకునే స్వభావం కూడా ఉండదు. ఫలితంగా జననేంద్రియాల వద్ద పట్టిన చెమట అలాగే ఉండిపోతుంది. దీంతో ఆ ఏరియాలో బ్యాక్టీరియా, ఫంగస్, వంటివి వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఇది క్రమంగా ప్రత్యుత్పత్తి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా అది క్రమంగా ఇన్ఫెక్షన్స్ కు దారితీస్తుంది. కాబట్టి సాధ్యమైనంత తక్కువ సమయం జీన్స్ ధరించడం మంచిది.

 

ముఖ్యంగా కాలంతో సంబంధం లేకుండా చెమట ఎక్కువగా పట్టే శరీరతత్వం ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండడం అవసరం. సాధారణంగా బిగుతైన దుస్తులు ధరించి పడుకుంటే నిద్ర సరిగా పట్టదు. ఇక జీన్స్ వంటివి ధరిస్తే మరింత కష్టం. గాలి సరిగా జరగక శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇది నిద్రకు అంతరాయం కలిగిస్తుంది. జీన్స్ వంటి బిగుతైన దుస్తులు ధరించి నిద్రించడం వల్ల గర్భాశయం, పొత్తి కడుపు, జననేంద్రియా లపై ఒత్తిడి ఏర్పడుతుంది. అలాగే ఆయా భాగాలకు రక్తప్రసరణ కూడా సరిగా జరగదు. దీని కారణంగా నెలసరి సమయంలో నొప్పి తీవ్రమవుతుంది. రాత్రి సమయంలో బిగుతైన దుస్తులు ధరించడం వల్ల నడుంనొప్పి, కడుపుబ్బరం వంటి సమస్యలు కూడా వస్తాయి. బిగుతైన దుస్తులు ధరించడం వల్ల రక్తప్రసరణ సరిగా జరగదు. నరాలపైన కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. నీరసం, మైకం కమ్మడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నిద్రించే సమయంలో సాధ్యమైనంత వరకు వదులుగా ఉన్న కాటన్ దుస్తులు ధరించడం మంచిది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -