Uric acid: 5 రకాల జాగ్రత్తలతో కీళ్ల నొప్పులు మాయం?

Uric acid: కీళ్ల నొప్పులు ఇప్పుడు చాలా మందికి వేధిస్తున్న సమస్య. చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలామంది ఈ కీళ్ల నొప్పుల సమస్యతో బాధపడుతున్నారు ఎముకలు, కణజాలానికి సంబంధించిన సమస్య కావడంతో వీటి నివారణకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. కీళ్ల నొప్పుల సమస్యలో కూడా చాలా రకాలు ఉన్నాయి. దాదాపు 200 కంటే ఎక్కువే ఆర్థరైటిస్ సమస్యలున్నాయి. అనారోగ్యకరమైన ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల యూరిక్‌ యాసిడ్ సమస్యలు వస్తాయి. మరి యూరిక్ యాసిడ్ పెరగడానికి ప్రధాన కారణాలు ఏవి అన్న విషయానికి వస్తే..

మాములుగా టీ, కాఫీ, మాంసం, చేపలు, చాక్లెట్‌లను ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో యూరిక్ యాసిడ్ పరిమాణం పెరగడం ప్రారంభం అవుతుంది. దీర్ఘకాలిక కాలేయ వ్యాధి ఉండేవారిలో కూడా రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరుగుతాయి. శరీరంలో ఎంజైమ్ లోపం వల్ల కూడా హైపర్యూరిసెమియా ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. కాగా యూరిక్ యాసిడ్ వల్ల వచ్చే వ్యాధుల విషయానికి వస్తే.. యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు కీళ్ల నొప్పులు వస్తాయి. యూరిక్‌ స్థాయిలు రక్తంలో అదుపులో లేకపోవడం కారణంగా కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. అలాగే మూత్ర విసర్జనలో ఇబ్బందులు కూడా ఉండవచ్చు.

 

యూరిక్ యాసిడ్ తగ్గించుకోవడానికి ఇలా చేయండిలా.. యూరిక్ యాసిడ్ తగ్గించడానికి మాంసం, చేపలు, కాఫీ, టీ, చాక్లెట్లకు దూరం ఉండాల్సి ఉంటుంది.
యాసిడ్‌ ను అధిగమించడానికి పెరుగుతున్న బరువును తగ్గించుకోవాలి. ప్రతి రోజూ 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగాల్సి ఉంటుంది.
నారింజ, నిమ్మరసం, ఉసిరికాయ వంటి విటమిన్ సి అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాల్సి ఉంటుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -