Kushi Review: ఖుషి మూవీ రివ్యూ.. విజయ్ దేవరకొండ సమంత ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్టే కానీ?

Kushi Review: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ స్టార్ హీరోయిన్ సమంత కలిసిన నటించిన తాజా చిత్రం ఖుషి. శివా నిర్మాణ దర్శకత్వం వహించిన ఈ సినిమా తాజాగా నేడు అనగా సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని అందుకుంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని విజయ్ దేవరకొండ సమంత అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూశారు.

ఇక ఎట్టకేలకు ఈ సినిమా విడుదల అయ్యి సూపర్ హిట్ అందుకోవడంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. సమంత నటించిన సినిమా శాకుంతలం ఫ్లాప్ అయిన విషయం తెలిసిందే. అలాగే విజయ్ దేవరకొండ నటించిన గత సినిమా లైగర్ కూడా ఫ్లాప్ అయ్యింది. దీంతో వీళ్లిద్దరికీ ఈ సినిమా ఎంతో ముఖ్యమని చెప్పవచ్చు. ఇక సినిమా విడుదలైన తర్వాత బయట వినిపిస్తున్న టాక్ ని సోషల్ మీడియాలో వస్తున్న రివ్యూలను బట్టి చూస్తే సమంత అలాగే విజయ్ దేవరకొండ ఖాతాలలో బ్లాక్ బస్టర్ హిట్ సినిమా పడిందని అభిమానులు చర్చించుకుంటున్నారు.

 

అయితే అంతా బాగానే ఉంది కానీ, ఈ సినిమా విషయంలో కొందరు నెటిజన్స్ మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సినిమాలలో అక్కడక్కడ చిన్నచిన్న నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయని, మైనస్ లు కూడా ఉన్నాయని తెలుస్తోంది. సమంతా విజయ్ దేవరకొండ జోడి అంతగా సెట్ అవ్వలేదు అన్న వాదనలు కూడా ఎక్కువగానే వినిపిస్తున్నాయి. కథపరంగా నటీనటుల పనితీరు పరంగా అంతా బాగానే ఉన్నప్పటికీ సినిమాలో మాత్రం అక్కడక్కడ చిన్నచిన్న మిస్టేక్స్ ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఖుషి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నట్టే అని చెప్పవచ్చు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -