Shankhpushpi Plant: ఈ మొక్క ఇంట్లో ఉంటే దరిద్రం పారిపోతుంది .. ఆ తప్పులు మాత్రం చేయొద్దంటూ?

Shankhpushpi Plant:  సాధారణంగా మనం ఎన్నో రకాల పుష్పాలను చూస్తూనే ఉంటాము అయితే ఇలా మన భూమిపై వివిధ రకాల పుష్పాలకు సంబంధించిన మొక్కలు మనకు కనబడుతూ ఉంటాయి. అయితే ఆసియా ఖండంలో ఎక్కువగా విస్తరించినటువంటి పూల మొక్కలలో శంఖ పుష్పాలు ఒకటి. ఈ పువ్వులు చూడటానికి శంకు ఆకారంలో నీలిరంగులో ఉంటాయి అలాగే ఈ పుష్పాలలో తెలుపు రంగు పుష్పాలు కూడా ఉంటాయి కానీ నీలిరంగు పుష్పాలు ఎంతో పవిత్రమైన పుష్పాలుగా భావిస్తుంటారు.

పుష్పాలకు సంబంధించినటువంటి మొక్కలు ఎక్కడపడితే అక్కడ విపరీతంగా పెరుగుతూ ఉంటాయి ముఖ్యంగా పొలాల గట్ల వద్ద రోడ్డుకి ఇరువైపులా కూడా ఈ పూల మొక్కలు విపరీతంగా పెరుగుతాయి. ఈ పువ్వులను చూసినప్పుడు చాలామంది ఎంతో ఆకర్షణకు గురి అవుతూ ఈ పువ్వులను కోస్తూ ఉంటారు అయితే వాస్తు పరంగా ఈ పువ్వులకు పూల మొక్కలు ఇంట్లో ఉండటం ఎంతో శుభ సూచకం.

శంకు పుష్పాలు మొక్కలు కనుక మన ఇంట్లో ఉంటే ఇంట్లో ఉన్నటువంటి దరిద్రం మొత్తం తొలగిపోతుంది అయితే ఈ చెట్టు నాటే విషయంలోనూ అలాగే ఈ పుష్పాలను కోసి పూజ చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. శంకు పుష్పాలు దేవతల పూజలో విరివిగా ఉపయోగిస్తుంటారు ముఖ్యంగా విష్ణుమూర్తికి ఈ పువ్వులు అంటే చాలా ప్రీతికరం.

ఈ పుష్పాలతో విష్ణుమూర్తికి పూజలు చేయడం వల్ల ఆయన అనుగ్రహం మన పైనే ఉంటుంది అలాగే నీలిరంగులు ఈ పుష్పాలు ఉండటం వల్ల శనీశ్వరుడికి కూడా ఈ పుష్పాలు అంటే చాలా ఇష్టం ఈ పువ్వులతో శనీశ్వరుడికి పూజ చేయడం వల్ల శని అనుగ్రహం మనపై ఉండి శని బాధలు తొలగిపోతాయి. ఇక వాస్తు పరంగా ఎంతో అనుకూల పరిస్థితులను కలిగి ఉన్నటువంటి ఈ శంకు పుష్పాలను ప్రతి సోమవారం ఉదయం ఐదు పువ్వులను కోసి పారుతున్నటువంటి నీటిలో వేసి నమస్కరించడం వల్ల మనకు ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవని పండితులు చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -