Ivy Gourd Health Benefits: దొండ‌కాయ‌ల‌ను తింటే ఇన్ని లాభాలు ఉన్నాయా.. ఆ ఆరోగ్య సమస్యలు దూరమవుతాయా?

Ivy Gourd Health Benefits: మన కూరగాయలలో ఒకటైన దొండకాయ సంవత్సరం మొత్తం విరివిగా దొరుకుతుంది. దీనిని సాధారణ కాయగూరగా అనుకుంటాం కానీ దీని వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే ఆశ్చర్య పోవాల్సిందే. దొండకాయలో విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. పీచు, ప్రోటీన్లు కూడా లభ్యమవుతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాల వల్ల అలర్జీరాదు. దగ్గు, ఆకలి లేకపోవడం వంటి వాటితో బాధపడేవారు దీన్ని తినటం వల్ల ఫలితం ఉంటుంది. ఇందులో ఉండే కాల్షియం మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా చేస్తుంది. అలాగే ఎముకలకు గట్టితనాన్ని కూడా ఇస్తుంది. దొండకాయ లో ఉండే ఆక్సిడెంట్లు బ్యాక్టీరియాలను అడ్డుకుంటాయని ఆయుర్వేదం చెబుతుంది.

థైమీన్ దొండలో ఎక్కువగా ఉంటుంది. ఇది కొవ్వు ప్రోటీన్ల జీవక్రియకి ఉపయోగపడుతుంది. అలాగే బీ కాంప్లెక్స్ విటమిన్లు జీర్ణశక్తి అయ్యేలాగా చేస్తుంది. రీబోఫ్లేవిన్ పుష్కలంగా ఉండే దొండకాయ మనసుని ప్రశాంతంగా ఉంచి డిప్రెషన్ను తగ్గిస్తుంది. దొండకాయలో ఉండే విటమిన్ సి, బీటా కెరోటిన్లు, యాంటీ ఆక్సిడెంట్లుగా పని చేస్తూ శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి.

దొండ చక్కెర వ్యాధిగ్రస్తులు కూడా అనిరభ్యంతరంగా తినవచ్చు. ఎందుకంటే దొండలో శరీరంలో చక్కెరసాతాన్ని తగ్గించే గుణం ఉంది. అలాగే దొండలో ఉండే కాల్షియం మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడకుండా చేస్తుంది. అలాగే ఎముకలకు గట్టిదనాన్ని కూడా అందిస్తుంది. దొండకాయలు విటమిన్లు, కనిజాలు అధికంగా ఉంటాయి. పీచు, ప్రోటీన్లు కూడా అధికంగా లభ్యమవుతాయి. బరువు తగ్గాలి అనుకునే వారికి దొండకాయ మంచి ఆప్షన్.

ఎందుకంటే శరీరంలో ఉన్న అదనపు కొవ్వుని కరిగించే శక్తి దొండకాయలు ఉంది. దొండకాయలో ఉండే పొటాషియం వల్ల రక్త ప్రసన్న బాగా జరిగి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే దొండకాయలో లభించే ఫైబర్ వల్ల జీర్ణ సమస్యలు నయం అవ్వటంతో పాటు మలబద్ధకం సమస్య నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. అయితే చాలామంది దొండకాయ తినటం వలన మందబుద్ధి వస్తుంది అని చెప్పి తినడం మానేస్తారు కానీ అది వట్టి అపోహ మాత్రమే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -