Lord Shani Dev: అమావాస్య రోజు ఈ పనులు చేస్తే అప్పుల బాధలు తొలగి కోటీశ్వరులు అవుతారట.. ఏం చేయాలంటే?

Lord Shani Dev: మాములుగా చాలామంది అమావాస్య సమయంలో తెలిసి తెలియక కొన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటారు. వాటి వల్ల మానసికంగా ఆర్థికంగా ఎన్నో రకాల ఇబ్బందులను కూడా ఎదుర్కొంటూ ఉంటారు. అయితే అమావాస్య సమయంలో కొన్ని రకాల పనులు చేయడం వల్ల కూడా అప్పుల బాధలు తొలగిపోతాయట. మరి అప్పుల బాధలు తొలగిపోయి ఆర్థిక సమస్యలు లేకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కాగా శని దోషం ఉన్నవారు శని అమావాస్య రోజున దానధర్మాలు చేస్తే మంచిది. శని ప్రభావం ఉన్నవాళ్లు వారి లైఫ్ లో ఎన్నో సమస్యలని ఎదుర్కోవాలి. పనిలో ఆటంకాలు, ఆర్థిక బాధలు ఇలా ఏవో ఒకటి కలుగుతూ ఉంటాయి. ఇటువంటి సమస్యలను మీరు కూడా ఎదుర్కొంటున్నట్లయితే, శని అమావాస్య రోజున శని భగవానుడిని ఆరాధించడం మంచిది. అదేవిధంగా కొన్ని వస్తువులను కూడా దానం చేయాలి. ఒక గిన్నెలో నూనెని తీసుకుని, మీ మొఖాన్ని చూసి, ఆ గిన్నెతో నూనెని శని దేవుని ఆలయంలో ఉంచాలి. ఇలా పెట్టడం వలన శని దేవుడు సంతోషిస్తాడు.

అలాగే శుక్రవారం రాత్రి నిద్ర పోయేటప్పుడు నల్ల ఉప్పు, నల్ల వ‌స్త్రంలో చుట్టి దిండు కింద లేదంటే మీ దగ్గర పెట్టుకోవాలి. శనివారం రోజు శని దేవుని గుడిలో ఈ ఉప్పు మూటని ఇచ్చేయాలి. దీంతో, శని బాధలు పోతాయి. నల్లని యాంటీమొనిని కొని తల నుండి కాళ్ళ దాకా తొమ్మిది సార్లు తిప్పేసి, దానిని భూమిలో పాతి పెట్టండి. ఇలా చేస్తే శని ప్రభావం పోతుంది. శని బాధల నుండి బయటపడొచ్చు. జాతకంలో కనుక శని ప్రభావం ఉందని మీరు తెలుసుకుంటే, శని దేవుడిని పూజించేటప్పుడు ముఖం చూడకండి. పాదాలను మాత్రమే చూడాలి. కేవలం శనివారం అని కాకుండా అమావాస్య సమయంలో కూడా ఇటువంటి పరిహారాలు పాటించడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి.

Related Articles

ట్రేండింగ్

AP Government: వాలంటీర్లు లేకపోతే ఇంటింటికీ పెన్షన్ ఇవ్వలేరా.. వైసీపీ కావాలనే కుట్ర చేస్తోందా?

AP Government: వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చింది అయితే వాలంటీర్ ద్వారా సంక్షేమ పథకాలు అన్నిటిని కూడా ఇంటి వద్దకే తీసుకెళుతున్నారు. ఇందులో భాగంగా వృద్ధులకు పెన్షన్లను...
- Advertisement -
- Advertisement -