CM Revanth Reddy: జగన్ ను ఓడించాల్సిన అవసరం రేవంత్ కు ఉందా.. ఆర్కే పలుకుల మర్మమిదే!

CM Revanth Reddy: త్వరలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు కూడా జరగబోతున్నటువంటి తరుణంలో రెండు రాష్ట్రాలలో ఎన్నికల వేడి రాజుకుంటుంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఎంపీ సీట్లను కూడా గెలిపించుకునే బాధ్యత చాలా ఉంది కనుక పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు. అయితే మరోవైపు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించే అందుకు రేవంత్ రెడ్డి పరోక్షంగా చంద్రబాబుతో చేతులు కలిపారని తెలుస్తోంది.

తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డిని ఓడించే అవసరం చాలా ఉందనే చెప్పాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా గురు శిష్యులు అని చెప్పాలి వీరిద్దరి మధ్య గురు శిష్యులు అనుబంధం ఉంది. రేవంత్ రెడ్డి సపోర్టుతో ఇక్కడ చంద్రబాబు గెలిచే ఆలోచనలో ఉన్నారు. అయితే రహస్యంగా వీరిద్దరూ ఎయిర్ పోర్ట్ లో కొన్ని గంటల పాటు చర్చలు కూడా జరిపిన సంగతి తెలిసిందే.

మరోవైపు కేసీఆర్ సైతం జగన్మోహన్ రెడ్డి గెలుపును కోరుకుంటున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఈయన తమకు వచ్చిన సమాచారాల ప్రకారం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారని తెలిపారు. అయితే ఈ విషయాన్ని కెసిఆర్ తేలికగా చెప్పారని అనుకోవడం లేదు అంటూ రాధాకృష్ణ తన కొత్త పలుకుల ద్వారా ఈ విషయాలను తెలియచేశారు.

గత ఎన్నికలలో భాగంగా కెసిఆర్ జగన్మోహన్ రెడ్డికి చాలా వరకు సహాయం చేశారు అది ఆర్థిక పరమైన కావచ్చు భద్రతాపరమైన విధంగా కావచ్చు ఆయన గెలుపుకి కేసిఆర్ కృషి చేశారు. ప్రస్తుతం తెలంగాణలో ఓటమిపాలు అయినటువంటి కెసిఆర్ వచ్చే ఎన్నికలలో ఆయన అధికారంలోకి రావాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గెలిస్తే తన సహాయ సహకారాలతో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది ఇక ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డికి చాలా వరకు సుపరిచితులే అనే సంగతి తెలిసిందే. దీంతో ఇదే అవకాశం గా చేసుకొని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టాలని కెసిఆర్ పావులు కదుపుతో ఉండగా మరోవైపు జగన్ అధికారంలోకి రాకుండా ఉండాలని రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుతో చేతులు కలుపుతున్నారు అన్నది వాస్తవం అని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -