Pawan Kalyan: పవన్ కోసం పిఠాపురంలో 40 మంది పుష్పలు.. వైసీపీ ఆ రేంజ్ లో ప్లాన్ చేసిందా?

Pawan Kalyan:  ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచారాల జోరు పెంచారు రాజకీయ నాయకులు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా వరుసగా ప్రచార సభలలో పాల్గొంటున్నారు ఈ సందర్భంగా ఆయన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు నియోజకవర్గం లో పర్యటించారు. అక్కడ మకిలిపురం సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. తాను రాజకీయాలలోకి తెగించి వచ్చానని, సుమారు 40 మంది ఎర్రచందనం స్మగ్లర్లను తనకోసం పిఠాపురం, గోదావరి జిల్లాలలో దించారట.

ఒకటే చెబుతున్నా నేను పవన్ కళ్యాణ్ ని, ఇలాంటి వాటికి భయపడేవాడిని కాదు, నాకు అసలు భయాలే ఉండవు ఒకటే జీవితం జగన్ లాంటి గుండాలకు, పెద్దిరెడ్డి,మిథున్ రెడ్డి వంటి దోపిడీదారులకు భయపడేది లేదంటూ వెల్లడించారు. విజయవాడలో రంగా గారికి, దేవినేని నెహ్రూ గారికి గొడవ కులాల మధ్య గొడవలు గా మారాయి. సమాజంలో ఒక కులం లేకుండా మరొక కులం పనిచేయలేదు, రాష్ట్రంలో దుష్ట పరిపాలనకు అడ్డుకట్ట వేయవలసిన అవసరం ఉంది.

జనసేన పార్టీలో తాను మొదటి తరం రాజకీయ నాయకుడిని వెల్లడించారు. జగన్ లాగా తాతలు, తండ్రుల నుంచి 150 సంవత్సరాల నుంచి ఉన్న కాంగ్రెస్ నుంచి వచ్చిన వాడిని కాదని చెప్పారు. జగన్ వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది శ్రీకాకుళం, విజయనగరం, గోదావరి జిల్లాలు, కోనసీమ రైల్వే కోడూరు, కడప, రాజంపేట, తిరుపతి ఎక్కడికి వెళ్ళినా వైసీపీ ఓడిపోతుంది ప్రభుత్వం మారిపోతుందన్న విషయం అర్థమైందని చెప్పారు.

జనసేన పార్టీ మీకు భయపడేది కాదు మీరు ఒక చేయి ఎత్తితే మేము లక్ష చేతులు ఎత్తుతాం అంటూ హెచ్చరించారు. 2009లో రాజకీయాల్లోకి వచ్చినా దాన్ని నిలబెట్టుకోలేకపోయాం అన్న బాధ ఒకవైపు, రాజకీయాలలో కొనసాగటం అంత సులభం కాదంటూ వినిపించిన మాటలతో పంతం పట్టి మరి రాజకీయాలలో కొనసాగానని, ఎవరి ఆసరా లేకపోయినా దశాబ్ద కాలంగా పార్టీని నడిపానంటే ప్రజలు ఇచ్చిన బలమే అందుకు కారణమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -