AP Government: వాలంటీర్లు లేకపోతే ఇంటింటికీ పెన్షన్ ఇవ్వలేరా.. వైసీపీ కావాలనే కుట్ర చేస్తోందా?

AP Government: వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చింది అయితే వాలంటీర్ ద్వారా సంక్షేమ పథకాలు అన్నిటిని కూడా ఇంటి వద్దకే తీసుకెళుతున్నారు. ఇందులో భాగంగా వృద్ధులకు పెన్షన్లను కూడా స్వయంగా వాలంటీర్లు ఇంటికి తీసుకువెళ్లి ఇచ్చేవారు అయితే ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో వాలంటీర్లు సంక్షేమ పథకాలకు దూరంగా ఉండాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

ఈ క్రమంలోనే పెన్షన్లు కూడా ఇంటి వద్దకు తీసుకువెళ్లడం ఆగిపోయాయి. ఇలా వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఇవ్వడమే కష్టం అనేలా వైసిపి నేతలు పెద్ద ఎత్తున రచ్చ చేస్తున్నారు. గత ఇదే విషయాన్ని పెద్ద ఎత్తున రాజకీయం చేశారు. వాలంటీర్లు ఇంటి వద్దకు వెళ్లకపోతే పెన్షన్లు రావు అన్నట్టు వైసిపి వాళ్ళు ప్రచారం చేయడమే కాకుండా ఎండలో వృద్ధులను తిప్పుతూ ఏకంగా మరణం అంచుల వరకు తీసుకువెళ్లారు.

ఈ క్రమంలోనే ఈసారి పెన్షన్ విషయంలో ఎలాంటి అవకతవకలు ఉండకూడదని ముందుగానే ఈసి ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. వాలంటీర్లు ఇంటికి వెళ్లి పెన్షన్ ఇవ్వకపోతే బ్యాంక్ అకౌంట్ లో ఉన్న వారందరికీ కూడా ఈ నెల వచ్చే నెల పెన్షన్లు అకౌంట్లో జమ చేయాలని చెప్పారు. ఇక అకౌంట్లు లేని వారికి స్వయంగా సచివాలయ ఉద్యోగస్తులు వెళ్లి పెన్షన్ అందజేయాలని తెలిపారు.

ప్రతి గ్రామానికి దాదాపు పది మంది వరకు సచివాలయ ఉద్యోగాలు ఉన్నారు అంతేకాకుండా ఒక్కో గ్రామంలో 400 నుంచి 500 వరకు పెన్షనర్లు ఉన్నారు. ఇలా ఒక్క ఉద్యోగస్తునికి కేవలం వంద మంది పెన్షనర్లు మాత్రమే ఉంటారు అలాంటిది ఒక్కరోజులో పెన్షన్లు అందించడంలో ఏ మాత్రం ఆలస్యం జరగదని ఒక్కరోజులో పెన్షన్లు అన్నింటిని పూర్తి చేయవచ్చు కానీ వైసీపీ వారు కేవలం రాజకీయం కోసమే ఇలాంటి హంగామా సృష్టిస్తున్నారని తెలుస్తుంది. ఇలా పెన్షన్లను అడ్డుపెట్టుకొని రాజకీయ కుట్ర చేస్తున్నారని కూటమి భావిస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -