Pawan Kalyan: ఉప్మాకు అమ్ముడుపోవద్దంటూ పవన్ కళ్యాణ్ సెటైర్లు.. ఆ ఉప్మా ఎవరంటే?

Pawan Kalyan:  ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పవన్ కళ్యాణ్ తన ప్రచారం లో జోరు, ప్రసంగాలలో హోరు పెంచుతున్నారు. తనదైన స్టైల్ లో ప్రతిపక్షం వారిని విమర్శిస్తూ కూటమి అధికారంలోకి వస్తే ప్రజలకు వచ్చే లాభాలు ఏమిటో తెలియజేస్తున్నారు. ప్రచారంలో భాగంగా రాజోలు, పి. గన్నవరం నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు పవన్ కళ్యాణ్. తమ పార్టీని గెలిపించాలని, కూటమి అధికారుల్లోకి రావాలని ఆకాంక్షించిన పవన్ కళ్యాణ్ సడన్ గా ఉప్మా ప్రస్తావన తీసుకువచ్చారు.

అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉప్మా అని ఎవరిని ఉద్దేశించి అన్నారు అనే విషయంపై ఉభయగోదావరి జిల్లాల్లో పెద్ద చర్చే జరుగుతుంది. ఈయన ముద్రగడ పద్మనాభాన్ని దృష్టిలో పెట్టుకొని ఉప్మా ప్రస్తావన చేసి ఉండవచ్చా అని ఆలోచనలో పడ్డారు. నిజానికి ముద్రగడ పద్మనాభాన్ని ఎవరు ఎలాంటి విమర్శలు చేయవద్దని పవన్ కళ్యాణ్ గతంలోనే పార్టీ శ్రేణులకు సూచించారు. అయితే వైసీపీలో చేరిన ముద్రగడ పద్మనాభం మాత్రం పవన్ కళ్యాణ్ మీద అభ్యంతరకర పదజాలాన్ని వాడుతూ ఆయనని తీవ్రంగా విమర్శిస్తున్నారు.

ఆ విషయం దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ ఉప్మా ప్రస్తావన తీసుకొచ్చి ఉంటారు అని ఊహాగానాలు చేస్తున్నారు ప్రజలు. అయితే జనసైనికులు మాత్రం ఉప్మా కి అమ్ముడుపోయిన ముద్రగడ పద్మనాభం అంటూ సెటైర్లు వేయటం ప్రారంభించారు. గతంలో పవన్ కళ్యాణ్ దగ్గరికి నేను ఎందుకు వెళ్లాలి, నా స్థాయి ఏమిటి అంటూ ప్రగల్బాలు పలికిన ముద్రగడ ఇటీవల వైయస్ జగన్ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించినప్పుడు రోడ్డుమీద పడిగాపులు కాసిన సంగతి అందరికీ తెలిసిందే.

అయితే పవన్ కళ్యాణ్ ఉప్మా అని ఎవరిని ఉద్దేశించి అన్నారు మనకి అర్థం కాకపోవచ్చు కానీ ఎవరికి తగలలో వాళ్ళకి తగిలే ఉంటుంది. మరి వాళ్ళు ఎలాంటి రియాక్షన్ ఇస్తారో వేచి చూడాల్సిందే ఎందుకంటే పవన్ ఇచ్చిన వార్నింగ్ మామూలుగా లేదుగా. అల్లాటప్పా రాజకీయ నాయకులకి పవన్ కళ్యాణ్ ఇలాంటి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడనే విషయం అందరికీ తెలిసిందే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -