Koti Deepostavam 2023: దిగ్విజయంగా కొనసాగుతున్న కోటి దీపోత్సవం!

Koti Deepostavam 2023: కార్తీక మాసం మొదలవడంతో ప్రతి ఆలయం కూడా శివకేశవుల నామస్మరణలతో మారుమోగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ కార్తీకమాసంలో శివకేశవలను ఆరాధించడం వల్ల సకల సంతోషాలు కలుగుతాయని ప్రజలు భావిస్తారు. ఇక ఈ నెల మొత్తం పెద్ద ఎత్తున దీపాలను వెలిగిస్తూ శివ కేశవులను ఆరాధిస్తూ ఉంటారు ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి మహాకార్యానికి శ్రీకారం చుట్టినటువంటి భక్తి టీవీ గత దశాబ్ద కాలంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో కోటి దీపోత్సవం నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

 

కన్నుల పండుగగా ఈ కోటి దీపోత్సవ కార్యక్రమం ప్రతి ఏడాది కొనసాగుతుంది ఎంతోమంది అతిరథ మహా సమక్షంలో నిర్వహించే ఈ కోటి దీపోత్సవ కార్యక్రమానికి లక్షలాదిమంది భక్తులు తరలివచ్చి దీపాలను వెలిగిస్తూ ఆ శివకేశవలను స్మరించుకుంటున్నారు. మీడియా రంగంలో అతిపెద్ద ఛానల్ అయినటువంటి ఎన్టీవీ ఆధ్వర్యంలో భక్తి టీవీ రచన టెలివిజన్ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ కోటి దీపోత్సవ కార్యక్రమం ఈ ఏడాది కూడా అంతే భావంతో ఎంతో ఘనంగా జరుగుతుంది. ఎన్టీవీ ఆధ్వర్యంలో 14 రోజులపాటు ఎంతో ఘనంగా జరిగే కోటి దీపోత్సవ కార్యక్రమానికి వేద పండితులు తరలివస్తారు. అలాగే అతిరథ మహారధుల సమక్షంలో లక్షలాదిమంది భక్తులు హాజరవుతుంటారు.

 

ఇక ఈ ఏడాది కూడా కార్తీక మాసం 14వ తేదీ నవంబర్ మంగళవారంతో మొదలైనటువంటి ఈ కార్యక్రమం నవంబర్ 27 వరకు కొనసాగుతూ ఉంది. దేశం నలమూలల నుంచి పీఠాధిపతులు యోగులు ఒకే వేదికపై హాజరయ్యే ఈ అద్భుతమైన కార్యం కోసం భక్తులు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక వీటన్నింటికీ మించి లక్షలాదిమంది భక్తులు ఒకేసారి ఓకే చోట భక్తిశ్రద్ధలతో నిర్వహించే ఈ కార్యక్రమం కన్నుల పండుగగా ఉంటుందని చెప్పాలి.దీపం జ్యోతిః పరంబ్రహ్మ.. దీపం సర్వతమోపహం.. దీపేన సాధ్యతే సర్వం.. సంధ్యాదీప నమోస్తుతే” అంటారు.

 

దీపం వెలుగుకు, జ్ఞానానికి సంకేతం, అధ్యాత్మికంగా దీపానికి చాలా ప్రముఖ్యం ఉంది..మన సంస్కృతికి సంప్రదాయానికి దీపారాధన పట్టుగొమ్మగా నిలిచింది.. అటువంటి సంప్రదాయాన్ని భవిష్యత్‌ తరాలకు సమున్నతంగా పరిచయం చేయడమే లక్ష్యంగా 2013 నుంచి భక్తి టీవీ ఈ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఇలా గత దశాబ్ద కాలంగా ఎంతో అంగరంగ వైభవంగా భక్తిశ్రద్ధలతో ప్రతి ఏడాది కార్తీక మాసంలో ఈ కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

 

ఇలా ప్రతి ఏడాది ఆ శివకేశవులను స్మరించుకుంటూ ఏర్పాటు చేసినటువంటి ఈ భక్తి కోటి దీపోత్సవ కార్యక్రమంలో భాగంగా ఎంతో మంది భక్తులు హాజరవుతూ దీపాలను వెలిగించి ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ వేడుకను జరుపుకుంటున్నారు. ఇక ఈ ఏడాది కూడా కోటి దీపోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రజలు తరలివచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, ఆ శివ కేశవుల అనుగ్రహం, ఆశీర్వాదాలు పొందాలని భక్తి కోటి దీపోత్సవ కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -