Arul Saravanan: లెజెండ్ ఫేమ్ అరుళ్ శరవణన్ మరో సినిమా.. ఈ సినిమాకు ఎన్ని కోట్లు ఖర్చు పెడతాడో!

Arul Saravanan: సినీ లవర్స్ కి లెజెండ్ ఫేమ్ హీరో అరుళ్ శరవణన్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఇతడు ఒక పెద్ద బిజినెస్ మాన్.. అంతేకాకుండా చాలా వ్యాపార రంగాల్లో కూడా షేర్లు ఉన్నాయి. ఇక ప్రస్తుతం ఇతనికి 50 సంవత్సరాలు ఉంటాయి. కాగా ఈ వయసులో అరుళ్ కి హీరో కావాలనే కోరిక పుట్టింది. అనుకున్నంత ఈజీ గానే అరుళ్ ప్రేక్షకుల ముందుకు ఒక సినిమాతో వచ్చేసాడు.

లెజెండ్ టైటిల్ తో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులు ముందుకు వచ్చేసాడు. అంతేకాకుండా ఈ సినిమాను మొక్కుబడిగా కాకుండా 60 కోట్ల బడ్జెట్ తో చాలా రిచ్ గా ప్లాన్ చేసాడు. అంతేకాకుండా తన సినిమాను తానే సొంతంగా నిర్మించుకున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా మెప్పించిన ఊర్వశి రౌతేలాకు దాదాపు రెండు కోట్ల పైనే రెమ్యూనేషన్ ఇచ్చినట్లు తెలుస్తుంది. కానీ ఈ సినిమా అరుళ్ ను ఒక రేంజ్ లో నిరాశపరిచింది.

ఈ సినిమాను ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా తమిళ, కన్నడ, మలయాళం, హిందీ, తెలుగు లో విడుదల చేసినప్పటికీ కలెక్షన్స్ విషయంలో మాత్రం ఈ సినిమా పూర్తిగా ఓడిపోయింది. పది హెడు కోట్లను మాత్రమే ఈ సినిమా దక్కించుకున్నట్లు తెలుస్తుంది. మొత్తానికే అరుళ్ లెజెండ్ మూవీ తో భారీ నష్టాన్ని చవి చూశాడు. ఇక ఏదో తన కోరికను తీర్చుకోవడానికి అరుళ్ ప్రేక్షకులకు ముందుకు వచ్చాడు అని చాలామంది అనుకున్నారు.

కానీ ఇందులో తెలియని విషయం ఏమిటంటే అరుళ్ మరోసారి ప్రేక్షకులు ముందుకు ఒక సినిమాతో వస్తున్నాడు. యాక్షన్ రొమాంటిక్ జోనర్ లో అతని రెండోవ చిత్రం ఉంటుందట. ఈ ప్రాజెక్టు గురించి ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. అరుల్ కొత్త మూవీకి సిద్ధంగా ఉన్నాడు. అతని కొత్త మూవీ ప్రకటన త్వరలో రాబోతుందని కోలీవుడ్ ఫిలిం ట్రాకర్ రమేష్ బాల ఈ విషయాన్ని ఒక ట్వీట్ ద్వారా తెలియజేశాడు. మరి ఈ సినిమాకు అరుళ్ ఎన్ని కోట్లు ఖర్చు పెడతాడో అని నెటిజన్లు అనుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chengala Venkat Rao: జూనియర్ ఎన్టీఆర్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలి.. వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు వైరల్!

Chengala Venkat Rao: చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడం కాదు గాని ప్రతీ వైసీపీ నాయకుడు నోటికి వచ్చిన స్టేట్మెంట్ ఇస్తూ వెలుగులోకి వస్తున్నారు. అందులో చాలామంది జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడటం...
- Advertisement -
- Advertisement -