SUV: కారు కొనాలని చూస్తున్నారా.. మిడ్ సైజ్ SUV కార్స్ మీకోసం?

SUV: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో మిడ్-సైజ్ SUV కి క్రేజ్ గురించి మనందరికి తెలిసిందే. కాగా గత కొన్నేళ్లలో చాలా కార్ల తయారీదారులు ఈ విభాగంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే 2003 జనవరి నెలలో జరగనున్న ఆటో ఎక్స్ పో 2023లో కొన్ని కార్ కంపెనీలు వారి ప్రస్తుత మిడ్-సైజ్ SUV లను ప్రదర్శించడానికి సంసిద్ధమవుతున్నాయి. మరి ఈ నెలలో ప్రారంభించనున్న వాహనాల వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కాగా భారత్ లో హ్యుందాయ్ అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో క్రెటా కూడా ఒకటి. అయితే, ఈ సంవత్సరం కొత్త పోటీదారుల ప్రవేశం ధర ప్రజాదరణను బెదిరించే అవకాశం ఉంది. కాబట్టి హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌ను పరిచయం చేయనుంది.

 

ఇది టక్సన్ ప్రేరేపిత పారామెట్రిక్ జ్యువెల్ గ్రిల్ వంటి కార్లను కలిగి ఉంటుందని సమాచారం. అలాగే అదనంగా, ADAS సాంకేతికత స్వీకరణ కూడా ఉంటుందనీ అంచనా. కాగా హ్యుందాయ్ కారును ఏప్రిల్ నెలలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రముఖ కార్లు తయారీ సంస్థ కియా కూడా దాని అత్యంత ప్రజాదరణ పొందిన కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్‌ను పరిచయం చేయబోతోంది. కాగా అందుకు సంబంధించిన కారు కొన్ని నెలల క్రితం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. దానికి ముందు భాగంలో పెద్ద గ్రిల్స్, కొత్త LED DRLలు, కొత్త డిజైన్ అల్లాయ్ వీల్స్ మరియు రీడిజైన్ చేయబడిన వెనుక భాగం ఉన్నాయి. కియా సెల్టోస్‌లో 1.5 లీటర్ పెట్రోల్, 1.4 లీటర్ టర్బో పెట్రోల్ 1.5 లీటర్ పవర్‌ట్రెయిన్‌లు ఉంటాయి.

 

కాగా ఈ కార్ వచ్చేనెలలో అనగా ఫిబ్రవరి లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. MG హెక్టర్ SUV దేశంలో 1 లక్ష కార్ల ఉత్పత్తికి చేరుకోవడంతో MG మోటార్ ఇండియా ఇప్పటికే హెక్టర్ ఫేస్‌లిఫ్ట్‌ను విడుదల చేసింది. అయితే కొత్త MG హెక్టర్ ఈ నెలలో భారతదేశంలో లాంచ్ చేయబడుతుందని భావిస్తున్నారు. ఇకపోతే ఫేస్‌లిఫ్ట్‌లో పెద్ద గ్రిల్స్, రీడిజైన్ చేయబడిన హెడ్‌ల్యాంప్‌లు, ఇంటీరియర్‌లో 14 అంగుళాల టచ్ స్క్రీన్‌లు, ADAS టెక్నాలజీలు ఉండనున్నాయి. అయితే గత కొన్ని వారాలుగా, టాటా హ్యారియర్ ఫేస్‌లిఫ్ట్ టెస్ట్ డ్రైవ్ చేస్తున్నట్లు కనుగొనబడింది. అయితే ఈ SUV ఆటో ఎక్స్‌పోలో కూడా ప్రదర్శించబడుతుంది. కాగా త్వరలో విడుదల వుతుందని భావిస్తున్నారు. ఇందులో బాహ్య డిజైన్ చాలా తక్కువగా మార్చబడిందని, ఇంటీరియర్ పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇతర ఫీచర్లతో పాటు రివైజ్డ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను పొందుతుంది. ఇతర SUVల మాదిరిగానే, హారియర్ ఫేస్‌లిఫ్ట్ కూడా ADAS సాంకేతికతను కలిగి ఉంటుందని అంచనా.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -