YS Sharmila: ఆస్తుల కోసం షర్మిల కోర్టుకు వెళ్తుందా.. తండ్రి ఆస్తులను జగన్ ఇచ్చే ఛాన్స్ లేదా?

YS Sharmila: వైయస్ జగన్మోహన్ రెడ్డి పట్ల తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ గత కొంతకాలంగా తన సోదరి వైఎస్ షర్మిల రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే వీరిద్దరి మధ్య ఎందుకు మనస్పర్ధలు వచ్చాయనే విషయం తెలియదు కానీ వైయస్ షర్మిల మాత్రం తన అన్నయ్య జగన్మోహన్ రెడ్డిని భారీ స్థాయిలో విమర్శిస్తున్నారు.

ఇక వైయస్ షర్మిల ఆస్తి కోసమే ఇలా తన అన్నతో పోరాటం చేస్తున్నారని కూడా తెలుస్తోంది..తన తండ్రి సంపాదించిన ఆస్తులలో తన వాట తనకు ఇవ్వాలని ఈమె డిమాండ్ చేస్తున్నారట కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆస్తి ఇచ్చే పరిస్థితి లేదని తెలుస్తుంది. దీంతో ఆమె కోర్టుకు కూడా వెళ్తారని తెలుస్తోంది. అయితే కోర్టుకు వెళ్తే మాత్రం తనకు ఆస్తి రూపాయి కూడా రాదని చెప్పాలి.

వైయస్ రాజశేఖర్ రెడ్డి సీఎం కాక ముందు వరకు సంపాదించిన ఆస్తులు ఏమీ లేవు ఆయన చివరికి హైదరాబాదులో తన ప్యాలెస్ కూడా అమ్మాలని అనుకున్నారు కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం తర్వాత ఆయన దశ తిరిగిపోయింది. భారీ స్థాయిలో అక్రమంగా ఆస్తులను సంపాదించారు అయితే ఆస్తులు ఏవి కూడా తనపై లేకుండా పలు కంపెనీల పేర్లతో ఉన్నాయి. ఇందులో సూట్ కేస్ కంపెనీల్లోనే ఎక్కువ ఆస్తులు ఉన్నాయి.

జగన్మోహన్ రెడ్డి నామినేషన్ తో పాటు ప్రకటించిన ఆస్తుల పత్రాలు చూస్తే.. లోటస్ పాండ్ ఎవరిది.. తాడేపల్లి ప్యాలెస్ ఎవరిది… యలహంక ప్యాలెస్ ఎవరిది .. బెంగళూరు మంత్రి మాల్ ఎవరిది… పులివెందులో,కడప సహా పలు నగరాల్లో ఉన్న ప్యాలెస్ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి పేరు మీద లేవు.

ఇవన్నీ కూడా సూట్ కేస్ కంపెనీల పేర్ల మీద ఉన్నాయని తెలుస్తుంది.. దీంతో ఈమె న్యాయ పోరాటం చేసి కోర్టుకు వెళితే ఆస్తులు ఏవి కూడా షర్మిలకు వచ్చే అవకాశాలు లేవు కనుక ఈమె రాజకీయంగా తన అన్న పై పోరాటం చేస్తూ ఆస్తి సంపాదన కోసం కష్టపడుతున్నారు. ఇక తన పేరిట వచ్చే ఆస్తి అప్పు రూపంలో జమ చేసుకుంటున్నారని షర్మిల వాపోతున్నారు. తనకు కాకపోయినా కనీసం తన పిల్లలకైనా ఆస్తి అందేలా చూడాలని ఈమె తన అన్న పై రాజకీయ పోరాటానికి సిద్ధమయ్యారని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -