YS Viveka Murder Case: వివేకా హత్య కేసులో జగన్ ను దోషిని చేసేలా దస్తగిరి ప్రయత్నం.. ఏమైందంటే?

YS Viveka Murder Case: గత ఐదు సంవత్సరాల క్రితం దారుణ హత్యకు గురైనటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇప్పటికీ పరిష్కారం కాలేదని చెప్పాలి. ఈ కేసు సిబిఐ దర్యాప్తు చేస్తున్నప్పటికీ కూడా నిందితులను పట్టుకోకపోవటం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది స్వయంగా నిందితులే నా వెనుక వీళ్ళు ఉన్నారని చెబుతున్న కూడా సిబిఐ దోషులను గుర్తించకపోవడం వెనుక పెద్ద కుట్ర ఉందని తెలుస్తోంది.

వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి దస్తగిరి ప్రస్తుతం బయటకు వచ్చి రాజకీయాలలో పోతున్నారు. వివేకానంద రెడ్డి హత్య వెనుక అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి భారతి ఉన్నారని తెలియజేశారు. మా వాళ్లు ఎలా చెబితే అలా చెయ్యి అంతా నేను చూసుకుంటాను అంటూ జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారని మీడియా సమావేశంగా దస్తగిరి చెబుతున్నారు.

వివేకానంద రెడ్డిని హత్య చేయడానికి ముందు కూడా తాను జగన్మోహన్ రెడ్డితో మాట్లాడానని ఈయన మీడియా సమావేశంలో తెలియజేశారు. సిబిఐ విచారణలో ఈ విషయాలు తెలిపారో లేదో తెలియదు కానీ మీడియా సమావేశంలో మాత్రం తెలియజేస్తున్నారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో మొదటి నుంచి కూడా అన్ని స్పష్టంగా గమనిస్తే అందరి వేళ్ళు జగన్మోహన్ రెడ్డి వైపే చూపుతున్నాయి.

దారుణంగా హత్యకు గురైన తన బాబాయ్ గుండెపోటుకు గురయ్యారంటూ సాక్షిలో ప్రచురించడం తన బాబాయ్ చనిపోయారని ఈయన కడపకు రోడ్డు మార్గాన రావటం, పని అయిపోయిందంటూ తెల్లవారుజామున 3 గంటలకు భారతికి ఫోన్ రావటం ఇలా వీటన్నింటినీ కనుక పరిశీలిస్తే ఈ హత్య వెనుక జగన్ హస్తం ఉందని తెలుస్తోంది.ఇప్పుడు దస్తగిరి అదే చెబుతున్నారు. వివేకా హత్యకేసు దర్యాప్తునకు ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. చివరికి ఓ నిందితుడ్ని సీబీఐ అరెస్టు చేయలేకపోవడం అనే విచిత్రం కూడా ఈ కేసులోనే చోటు చేసుకుంది. జూన్ 4 తర్వాత వివేక హత్య కేసులో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయని స్పష్టంగా తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -