Big Shock to Vanga Geetha: వైసీపీ అభ్యర్థి వంగా గీతకు వరుస షాకులు.. సమస్యలు పరిష్కరించకుండా ఓట్లు అడుగుతారా?

Big Shock to Vanga Geetha: మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఏపీ మొత్తం ఒకవైపు అయితే పిఠాపురం మాత్రం మరో వైపు అన్నట్టుగా అందరి చూపు పిఠాపురం వైపే ఉంది. పిఠాపురంలో కూటమిలో భాగంగా జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండగా పవన్ కళ్యాణ్ కు పోటీగా వైసీపీ నుంచి వంగా గీత బరిలోకి దిగారు.

అయితే పవన్ కళ్యాణ్ కు పిఠాపురంలో భారీ స్థాయిలో మద్దతు లభిస్తుంది ఇక ఈయన గెలుపు కూడా ఖాయమైందనే చెప్పాలి కానీ ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నటువంటి వంగా గీతకు మాత్రం ప్రజల నుంచి తీవ్రస్థాయిలో చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. తాజాగా ప్రచార కార్యక్రమాలలో భాగంగా వంగా గీత గొల్లప్రోలు పట్టణంలోని 20వ వార్డులో పర్యటించారు. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వెనుక వీధిలో ఈమె ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఇళ్లల్లో ఉన్నటువంటి మహిళలను బయటకు పిలిచి తమకు ఓటు వేయాలంటూ కోరారు అయితే ఆ మహిళలు మాత్రం వంగా గీతకు ఎదురు తిరిగారు. తమకు తాగునీరు లేదు, రోడ్లు, డ్రైన్లు అధ్వానంగా ఉన్నాయని, సుద్దగడ్డ కాలువలకు వరదలు వస్తే వరద నీటితో సహవాసం చేస్తున్నామని, ఇన్ని సమస్యలతో సతమతమవుతున్నా పరిష్కరించరు కానీ.. మీరు ఓట్లడగడానికి వస్తే మేము రావాలా అంటూ ఆమెను నిలదీశారు.

వారి ప్రశ్నలకు వంగా గీత సమాధానం చెప్పే ప్రయత్నం చేసిన వారు మరిన్ని ప్రశ్నలు అడగడంతో ఇక చేసేదేమీ లేక ఆమె వెనుతిరిగారు. ప్రస్తుతం కాకినాడ ఎంపీగా కొనసాగుతూ ఉన్నటువంటి వంగా గీత తిరిగి వైసీపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నప్పటికీ కూడా ఈమెకు భారీ స్థాయిలో వ్యతిరేకత ఏర్పడటం పవన్ గెలుపుకు కీలకంగా మారిందని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -