Maddinson: క్రికెట్ లో ఎప్పుడూ చూడని షాకింగ్ ఘటన.. అలా జరగడంతో అవాక్కైన ఫ్యాన్స్

Maddinson: క్రికెట్ అంటే చాలా మందికి ఇష్టం. ఆ ఆటకు పెట్టింటి పేరుగా భారత్ నిలిచిపోతుంది. ఏ జట్టుతో అయినా టీమిండియా క్రికెట్ ఆడుతోంది అంటే అందరూ టీవీలకు అతుక్కుపోతారు. అందులోనూ ఇండియా, పాక్ మ్యాచ్ అంటే ఇక చెప్పాల్సిన పని లేదు. ప్రపంచం మొత్తం ఆ మ్యాచ్ ను చూస్తూ ఎంజాయ్ చేస్తారు. ఇటువంటి ఘనమైన చరిత్ర ఉన్న క్రికెట్ లో అప్పుడప్పుడూ వింతలు, విడ్డూరాలు జరుగుతూ ఉంటాయి. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి చోటుచేసుకుంది.

 

క్రికెట్ చరిత్రలో ఎప్పుడూ చూడని సంఘటన శుక్రవారం రోజు జరిగింది. బీబీఎల్ టోర్నమెంట్ లో దానిని మనం చూడొచ్చు. బ్రిస్బేన్ హీట్ జట్టు పై మాడిన్సన్ అనే బ్యాటర్ ఫుల్ షాట్ కొట్టాడు. అలా ఫుల్ షాట్ కొట్టేందుకు ప్రయత్నించే క్రమంలో ఒక్కసారిగా స్టంప్స్ పై ఉన్నటువంటి బెయిల్స్ కింద పడ్డాయి.

 

బ్యాట్, బాల్, బాడీ ఇవేవి కూడా తగలకుండానే బెయిల్స్ కింద పడ్డాయి. దీంతో స్టేడియంలో ఉన్నవారంతా ఆశ్చర్యపోయారు. టీవీలో మ్యాచ్ చూస్తున్నవారు కూడా అది నిజమా? కాదా అని కాస్త ఆలోచించారు. మొదట మాడిన్సన్ కూడా తాను అవుట్ అయినట్లు భావించాడు. పెవిలియన్ కూడా వెళ్లిపోయాడు.

 

ఆ తర్వాత అంపైర్లు రివ్యూ చేసి చూడగా అది అవుట్ కాదని తేలింది. దీంతో పెవిలియన్ కు వెళ్లిన మాడిన్సన్ ను వెనక్కి పిలిపించారు. క్రికెట్ చరిత్రలో ఇటువంటి ఘటన ఇది వరకూ ఎప్పుడూ జరగలేదు. చాలా మంది మొదట బాల్ వికెట్లకు తగిలిందేమో అనుకున్నారు. అయితే మరికొందరు బాడీ వికెట్లకు టచ్ అయ్యి ఉంటుందని భావించారు. ఇవేవీ కాకుండా వికెట్లపై ఉన్న బెయిల్స్ వాటంతట అవే పడటంతో అందరూ ఆశ్చర్యపోయారు. క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం మొదటిసారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -