Mahatma Gandhi: భార్య కాకుండా మహాత్మా గాంధీ ప్రేమించిన మహిళ ఎవరో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Mahatma Gandhi: భారతదేశానికి బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్య్రం తెచ్చినవారిలో అగ్రస్థానంలో ఉండేది మహాత్మా గాంధీ. భారతీయులందరు గాంధీజీని ‘జాతిపిత’ గా ఎంత గౌరవంగా పిలుచుకుంటారు. ఇక స్వాతంత్ర పోరాటంలో గాంధీజీ పాత్ర ఎంతో కీలకంగా ఉందని చెప్పాలి. ఇలా స్వాతంత్ర సమరయోధుడిగా ఉన్నటువంటి గాంధీజీని కస్తూరిబా పెళ్లి చేసుకున్నారు. ఇలా గాంధీజీని పెళ్లి చేసుకున్నటువంటి ఈమె స్వాతంత్ర పోరాటంలో కూడా నిలిచారు.

ఇకపోతే గాంధీజీకి తన భార్య కస్తూరిబా మాత్రమే కాకుండా మరొక మహిళ కూడా ఎంతో ప్రేమించారట ఇదే విషయాన్ని చరిత్రకారుడు, రచయిత, అయిన రామచంద్ర గుహను ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. మరి గాంధీజీని అంతగా ప్రేమించినటువంటి ఆ మహిళ ఎవరు అనే విషయానికి వస్తే.. సరళా దేవి చౌధురాణి విద్యావేత్త, అభ్యుదయవాది, రాజకీయ కార్యకర్త. ఆమె తన భర్తతో కలిసి లాహోర్‌లో నివసించింది.

ఆమె చాలా నిష్ణాతురాలు, కవి, గాయని. ఆమె జాతీయవాద సమావేశాలలో బాగా పాడేది. గాంధీ ఆమె పాడటం విన్నారు, గాంధీజీ ఆమె పట్ల ఆకర్షితుడు అయ్యాడు. అయితే ఈయన ఒకసారి లాహోర్ వెళ్ళినప్పుడు సరళ దేవి ఇంటికి వెళ్లారు. అయితే అక్కడ తన భర్త కూడా స్వాతంత్ర పోరాటంలో జైలుకు వెళ్లారు.. గాంధీజీ సరళ దేవి ఇంట్లోనే బస చేశారు అయితే వీరిద్దరి మధ్య బాగా సాన్నిహిత్యం పెరిగిపోయింది.

అప్పటినుంచి గాంధీజీ ఆమె రాసిన రచనలను, కవితలను తన ప్రసంగాలలో, పలు పత్రికలలో వినియోగించాడు. ఖాదీ గురించి దేశవ్యాప్తంగా ప్రచారం చేయడానికి గాంధీజీతో కలిసి సరళ దేవి భారత్‌లో పర్యటించారు. ఇక వీరిద్దరూ దూరంగా ఉన్నప్పుడు ఉత్తరాల ద్వారా ఒకరి విషయాలను మరొకరు తెలుసుకొని వారు ఇక సరళ దేవి కొడుకుకు గాంధీజీ మనవరాలిని పెళ్లి చేసుకున్నారు కొంతకాలం తర్వాత వీరిద్దరి బంధం ముగింపు పలకడంతో సరళ దేవి హిమాలయాలకు వెళ్లి ఒంటరిగా బ్రతుకుతూ మరణించారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -