Mangalavaram Trailer Review: మంగళవారం ట్రైలర్ రివ్యూ.. ఈ సినిమాతో పాయల్ స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకుంటుందా?

Mangalavaram Trailer Review: డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా ఆర్ఎక్స్ 100 ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పవలసిన అవసరమే లేదు. ఆ సంవత్సరం ఆ సినిమా ఎంతో పేరు తెచ్చుకొని కుర్రోళ్ళ మనసును ఊపు ఉపేసింది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన పాయల్ రాజ్ పుట్ కి చాలా పేరు వచ్చింది. తన వల్లే ఈ సినిమా ఒక రేంజ్ లో బ్లాక్ బస్టర్ అయింది.

ఈ సినిమాలో క్యాస్ట్, డైరెక్షన్, మ్యూజిక్ అలాగే సినిమేటోగ్రఫీ కూడా చాలా బాగుంటాయి. అందుకే అజయ్ భూపతి రెండవ సినిమా అయినా మహా సముద్రానికి పెద్ద బడ్జెట్ పెట్టారు ప్రొడ్యూసర్. కానీ ఈ సినిమా అనుకున్నంత రీతిలో ఆడకపోవడం బాధాకరమైన విషయం. కథ బానే ఉన్నా స్క్రీన్ ప్లే స్లో గా ఉండడంతో ఆడియన్స్ కి ఈ సినిమా పెద్దగా ఎక్కలేదు. అయితే మూడోసారి మళ్లీ అజయ్ భూపతి మంగళవారం అనే సినిమాతో తెర మీదకి వస్తున్నారు.

ఈ సినిమా ఒక థ్రిల్లర్ లా వస్తుందని ట్రైలర్ చూస్తే మనకు తెలుస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా పాయల్ రాజ్ పుట్ కనిపించనుంది. అయితే ప్రతి మంగళవారం ఎవరో ఒకరు చనిపోవడాన్ని మనకి ట్రైలర్ లో చూపిస్తారు. అమ్మవారు పాయల్ లో ఆవహించినట్టు కూడా చూపిస్తారు. ఈ ట్రైలర్ మాత్రం ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయిందనే చెప్పాలి. ఆర్ఎక్స్ 100 సినిమా అంత బ్లాక్ బస్టర్ కావడానికి మరొక పెద్ద రీజన్ చేతన్ భరద్వాజ్ మ్యూజిక్.

పిల్లా రా పాట ఇప్పటికీ అందరి ప్లే లిస్టులలో రాణిస్తూనే ఉంది. ప్రతి ఒక్కరూ ఇప్పటికీ ఆ పాటని ఎంతలా అభినందిస్తారో అందరికీ తెలిసింది. అయితే మంగళవారం సినిమాకి సంగీతం ఇస్తుంది కాంతార సినిమా మ్యూజిక్ డైరెక్టర్. మరి కాంతార లాంటి మంచి ఎఫెక్టివ్ మ్యూజిక్ ఈ సినిమాకి ఇస్తే ఆ సస్పెన్స్ థ్రిల్లర్ సీన్స్ వెనుక మ్యూజిక్ ఒక రేంజ్ లో ఉంటుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -