IIT-Mandi Director: మాంసాహారం వల్లే ప్రకృతి విపత్తులు.. ఐఐటీ మండీ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

IIT-Mandi Director:  ఇటీవల కాలంలో హిమాచల్ ప్రదేశ్ లో చోటు చేసుకున్నటువంటి ప్రకృతి విపత్తు వల్ల ఎంత నష్టం జరిగిందో అందరికీ తెలిసిందే. ఈ ప్రకృతి విపత్తు కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడమే కాకుండా ఆస్తి నష్టం కూడా జరిగింది. అయితే ఈ ప్రకృతి విపత్తుకు జరగడానికి మాంసాహారమే కారణమంటూ తాజాగా ఐఐటి మండి డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఐఐటి మండి డైరెక్టర్ లక్ష్మీధర్ బెహరా హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన విపత్తుల గురించి మాట్లాడటమే కాకుండా ఇలాంటి విపత్తులు జరగడానికి కారణం మనుషులు అధికంగా మాంసాహారం తీసుకోవడమేనని ఇలా ఎక్కువగా మాంసాహారం తినడానికి జీవహింస చేయడం కారణమని తెలియజేశారు. ఇలా జీవహింస కారణంగానే ప్రకృతి విపత్తులు వస్తున్నాయని చెప్పడమే కాకుండా విద్యార్థులతో కూడా ప్రతిజ్ఞలు చేయించారు.

అమాయకమైన జంతువులను వధిస్తున్నారు. పరస్పర ఆధారిత సహజీవి సంబంధం వల్ల ఇది పర్యావరణ విద్వంశానికి కారణమవుతుంది. అయితే జీవహింస ప్రభావం మనకు తక్షణమే కనపడకపోయినా ఆలస్యంగా ఇది మనకు కనపడుతుందనీ, ఇదంతా మనుషులు మాంసాహారం తినడం వల్లే అంటూ ఈయన చెప్పినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో వైరల్ గా మారడంతో ఈయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడమే కాకుండా పలువురు నెటిజన్స్ ఈయన వ్యాఖ్యలపై విమర్శలు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -