Metro: రైలు ట్రాక్‎ల కింద ఉండే కంకర రాళ్లు.. మెట్రో ట్రాక్‎లో ఎందుకు కనిపించవు?

Metro: మనకున్న రవాణా వ్యవస్థలో అతి తక్కువ ధరలో మనకు అందుబాటులో ఉన్న రవాణా వ్యవస్థ రైలు వ్యవస్థ అని చెప్పుకోవాలి. సామాన్యుడు కూడా ఖరీదు చేసే తక్కువ టికెట్ ధరలతో రైలు ప్రయాణం చేయవచ్చు. అయితే రైలు ట్రాక్ లను మనం మామూలుగా చూసినప్పుడు కంకర రాళ్లు కనిపిస్తుంటాయి. ట్రాక్ కింది భాగంలో భారీగా కంకర వేసి వాటి మీద ట్రాక్ పట్టాలను ఏర్పాటు చేసి ఉంటారు.

అసలు ఈ కంకర రాళ్లను ఎందుకు ఉపయోగిస్తారో మీకు తెలుసా? ట్రాక్ ల కింద, చుట్టూ వాడే కంకర రాళ్లను బల్లాస్ట్ అని అంటారు. రైల్వే ట్రాక్ మధ్యలో కాంక్రీట్ దిమ్మలను లేదంటే చెక్క దిమ్మలను ఉపయోగిస్తుంటారు. వాటిని స్లిపర్స్ (దిమ్మలతో ట్రాక్ ను కలిపి ఉంచే నట్ బోల్ట్ లతో కూడిన వస్తువులు)తో కలిపి ఉంచుతారు. ఇలా దిమ్మలకు పట్టాలను కూడా అమరుస్తారు. అయితే ఈ పట్టాలు సరైన పొజిషన్ లో పెట్టడానికి కంకర రాళ్లను పోసి అటు ఇటు కదలకుండా ఫిక్స్ చేస్తారు.

ఇలా సెట్ చేసిన ట్రాక్ ల కింద ఉండే కంకరను ఎప్పటికప్పుడు సరి చూసుకుంటూ ఉంటారు. అలాగే బ్యాలెన్స్ సరిగ్గా ఉన్నాయా లేదా అని కూడా చెక్ చేస్తుంటారు. అయితే ఇలాంటి సెటప్ మెట్రా ట్రాక్ లకు ఉండదు. దీనికి కారణం మెట్రో ట్రాక్ లను కాంక్రీట్ దిమ్మలతో ఫిక్స్ చేసి ఉంటారు. బ్యాలన్స్ ని సరిగ్గా మెయింటెన్ చేయడానికి కాంక్రీట్ దిమ్మలను సెట్ చేస్తారు.

అలాగే మెట్రో ట్రాక్ ల మీద వైబ్రేషన్ ఎక్కువ రాకుండా ఉండేందుకు ప్రత్యేక ఏర్పాటు కూడా చేస్తారు. నిజానికి వైబ్రేషన్ రాకుండా జాగ్రత్తపడటం అనేది చాలా ఇబ్బందికరం మరియు ఖర్చుతో కూడుకొని ఉంటుంది. నేల మీద అయితే కంకర రాళ్లను వేసి అడ్జస్ట్ చేస్తారు కానీ మెట్రో ట్రాక్ లు నేల కింద లేదంటే భూమికి ఎత్తులో ఏర్పాటు చేస్తుంటారు. కాబట్టే మెట్రో ట్రాక్ లలో కంకర రాళ్లను ఉపయోగించకుండా, టెక్నాలజీ సాయంతో, కాంక్రీట్ దిమ్మలతోనే అంతా సెట్ చేస్తారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -