Mexico: దుకాణం ముందున్న బిచ్చగాడిని పెళ్లి చేసుకుంది..

Mexico:  ప్రేమకు కులం, మతం బేధం ఉండదు. ధనిక, పేద అనే తేడా ఉండదు. అందుకు ప్రేమ గుడ్డిది అంటారు. ఓ అందమైన యువతి అందవికారంగా ఉన్న యువకుడిని ప్రేమిస్తుంది. ఓ కోటీశ్వరుడి అబ్బాయి నిరుపేద యువతిని పెళ్లి చేసుకుంటున్నారు. చెప్పుకుంట పోతే ఎనెన్నో ఉదాహరణలు ఉన్నాయి. మెక్సికోకు చెందిన లుజ్‌ యెసెనియా, జువాన్‌ మెండోజాల ప్రేమ కథ. అలాంటి కోవకు చెందినదే.

2009లో మొదలైన ఈ ప్రేమ కథ చాలా వింతగా ఉంది. మెక్సికోలోని న్యూవో సాన్‌ జువాన్‌కు చెందిన లుజ్‌ యెసెనియా గెరోనిమో సెర్నా అనే మహిళ ఓ రోజు ఓ దుకాణౠనికి వెళ్లింది. అదే దుకాణం బయట ఉన్న బిచ్చగాడు జువాన్‌ మెండోజా అల్విజార్‌ను చూసింది. చూసి చూడంగానే నచ్చేశాడు. చిరిగిన బట్టలు, మొహమంతా మురికిగా మారి ఉంది. మురిగిగా ఉన్న అతడిని మేకోవర్‌ చేస్తానని అడగడంతో అతడు ఒప్పుకున్నాడు. ఆ తర్వాత అతడిని ఆమె తన ఇంటికి తీసుకెళ్లింది.

జువాన్‌కు మేక్‌ఓవర్‌ చేసి పూర్తిగా మార్చేసింది. కాసేపటికి జువాన్‌ తనను తాను అద్దంలో చూసుకుని ఒక్కసారిగా షాక్‌ అయ్యాడు. మళ్లీ మళ్లీ అద్దంలో తనకు తాను చూసుకుని మురిసిపోయాడు. లుజ్‌కు థ్యాంక్స్‌ చెప్పాడు. ఆ తర్వాత ఇద్దరు అప్పుడప్పుడు బయట కలుసుకునేవారు. ఆ తర్వాత వీరి పరిచయం మెల్లిమెల్లిగా స్నేహం మొదలైంది.

కొన్ని నెలలు గడిచిన తర్వాత ఇద్దరు ప్రేమించుకోవడం మొదలు పెట్టారు. ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి పెద్దల అంగీకారంతో పెళ్లి కూడా చేసుకున్నారు. వీరిద్దరి పెళ్లయి ఇప్పటికి పదేళ్లు అయింది. ఈ క్రమంలో లుజ్‌ తమ ప్రేమకథను టిక్‌టాక్‌లో షేర్‌ చేసింది. జువాన్‌ మేక్‌ ఓవర్‌కు ముందు.. ఆ తర్వాత ఫొటోలను, ఇద్దరూ కలిసిన దుకాణాన్ని కూడా పోస్టు చేసింది. జువాన్‌ను తాను ఇష్టపడటానికి కారణం చెబుతూ..‘ జువాన్‌ ఇతరుల్ని చాలా చక్కగా ట్రీట్‌ చేస్తాడు.

మొదటి చూపులోనే అతడి మీద నాకు ప్రేమ పుట్టింది. మొదటినుంచి మా ప్రేమ చాలా చక్కగా ఉండింది. దాని గురించే నేను ఎదురుచూస్తూ ఉండేదాన్ని. అతడి కుటుంబం కూడా నాకు చాలా బాగా నచ్చింది. వాళ్లు నన్ను వాళ్ల కూతురులాగా ట్రీట్‌ చేస్తారు’ అనిపేర్కొంది. జువాన్‌ ప్రస్తుతం ఓ తాపీ మేస్త్రీగా పనిచేస్తున్నాడు. మిగిలిన సమయంలో మొబైల్‌ ఫోన్స్‌ రిపేర్‌ చేస్తుంటాడు. వీరికి ముగ్గురు పిల్లలు లారిస్సా, కింబెర్లీ, జాజిల్‌ ఉన్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -