Hyderabad Police: సూల్తాన్‌ బజార్‌ సీఐ పద్మా చేసిన పనికి నెటిజన్లు ఫిదా!

Hyderabad Police: ప్రస్తుతం మహిళలు కూడా పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తూ కుటుంబానికి అండగా నిలుస్తున్నారు. కొందరు ఓ వైపు చదువుకుంటూ మరోవైపు కుటుంబ బాధ్యతలు చూసుకుంటుండగా.. మరి కొందరూ ఓ వైపు కుటుంబ బాధ్యతలు మోస్తూ.. ఉద్యోగాలు సైతం చేస్తున్నారు. అయితే.. కొన్ని సందర్భాల్లో వారికి అప్పుడప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అలాంటప్పుడు ఎదుటి వారు వారి పాలిట దేవుళ్లలా మారతారు. తాజాగా ఇలాంటి ఘటన భాగ్యనరంలో చోటు చేసుకుంది.

ఆదివారం జరిగిన పోలీస్‌ కానిస్టేబుల్‌ పిలిమినరీ రాత పరీక్షలో భాగంగా ఓ పరీక్ష కేంద్రానికి ఓ తల్లి తన చండిబిడ్డతో హాజరైంది. కానీ.. పిల్లాడిని చూసుకునేందుకు ఎవరూ లేరు. ఆ పరీక్ష కేంద్రానికి బందోబస్తు కోసం తన బృందంతో వచ్చిన సుల్తాన్‌ బజార్‌ సీఐ పద్మ పరీక్ష రాసేందుకు వచ్చిన ఆ మహిళ బాధ అర్థం చేసుకుని ఆ బుడ్డోడుని తన దగ్గరకు తీసుకుంది. ‘నువ్వెల్లి ప్రశాంతంగా పరీక్ష రాయ్‌..నేను నీ పాపను చూసుకుంటా’ అంటూ ఆ తల్లికి ధైర్యం పోసి పంపించింది. తన వాహనంలో కూర్చోని ఆ చిన్నారిని ఆడించింది.

ఈ క్రమంలో ఆ చిన్నారితో సీఐ పద్మ ఫొటో దిగి ‘అమ్మ పరీక్ష హాల్లో.. నేను పోలీస్‌ ఫ్రెండ్స్‌ తో’ అని క్యాప్షన్‌ పెట్టి ట్వీట్‌ చేసింది. పోలీస్‌ పరీక్షలో భాగంగా ఒక మహిళ పరీక్ష రాస్తుంటే.. ఆమె పిల్లాడిని తన ఒడిలో క్షేమంగా చూసుకున్నానని సీఐ పద్మ వెల్లడించింది. అయితే పోలీసులంటే కోసం, ఆవేశం కఠినంగా ఉంటారని కొందరు అనుకుంటారని కానీ.. పోలీసులు ఎలాంటి సమయంలోనైనా తన పదవి ఎంత పెద్దదైనా సమయం వచ్చినప్పుడు ఆ క్షణంలో ఎన్ని మెట్లు అయినా కిందకు దిగి ఆ సమస్యను పరిష్కరించేలా చేస్తారని ఈ పోలీస్‌ అమ్మా రుజువు చేసింది. ఈ వార్త నెట్టింట్లో వైరల్‌ కావడంతో ఒక అమ్మ మనసు.. ఇంకో అమ్మకే తెలుస్తుందని కామెంట్ల రూపంలో ప్రశంసలు కురిపిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -