Hanamkonda: మూడోకన్నుతో చూస్తూ.. పనులన్నీ చేస్తూ!

Hanamkonda: నేటి కాలంలో కాస్త ఇబ్బందులు తలెత్తిన వాటిని ఎదుర్కునలేక ఇబ్బందులు పడుతున్నారు. అన్ని సంక్రమంగా ఉన్నా.. సంతోషంగా ఉండటం లేదు. నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొలేక కొందౖరైతే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అయితే.. కొందరు విభిన్న ప్రతిభావంతులు తమలో ఉన్న లోపానికి భయపడకుండా ఆతస్థ్యైర్యంతో ముందుకు వెళ్తున్నారు. రోజూ ఎదురవుతున్న రకరకాల సమస్యలకు భయపడకుండా వాటికి దీటుగా పోరాడుతూ తమ జీవితాన్ని గడుపుతున్నారు.

అదే కోవకు చెందిన 65 ఏళ్ల చింతం రాజయ్యకు కంటిచూపు లేకపోయినా ఎవరి సహాయం లేకుండా ఊరంతా తిరగడం, నీటిలోని మోటార్లను బయటకు తీసి వాటికి మర్మతులు సైతం చేస్తూ వావ్‌ అనిపిస్తున్నాడు. నా అనుకున్న వాళ్లంత దూరమైపోయినా కుంగిపోయకుండా ఏ ఒకరిపై ఆధారపడకుండా తన జీవితాన్ని ముందుకు సాగదీస్తున్నాడు. ఇదంతా వింటే నిజమా అనుకుంటాం.. ఇదంతా అక్షరాల నిజమే. తెలంగాణలోని హనుమ కొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మాణిక్యాపురం గ్రామానికి చెందిన చింతం రాజయ్యాకు 6 ఏళ్ల వయసులోనే కంటి చూపు కోల్పోయింది. చిన్నప్పుడే వాళ్ల నాన్న రాజయ్యకు ఈత నేర్పిచండంతో అందులో ప్రావీణ్యం సంపాదిస్తూ పెద్దయ్యాడు రాజయ్య.

అయితే.. కళ్లు కనపడకున్నా వ్యవసాయ మోటార్ల మరమ్మతులు చేయడం నేర్చుకుని వాటిపై అపార పట్టు సాధించాడు. అంతటితో ఊరుకోలేదు. బావుల్లో చెడిపోయిన మోటర్లను ఒక్కడే దిగి నీటిలో మునిగి బయటకు తీసి వాటికి మరమ్మతులు చేసేవాడు. మోటార్లకు మరమ్మతులు చేస్తే వచ్చే డబ్బులతో ఎవరిపైన ఆధారపడకుండా జీవిస్తున్నారు. పొలాల్లోని బావుల దగ్గరకు ఎవరి సాయం లేకుండానే వెళ్లి వస్తారు. తల్లిదండ్రులు చనిపోయాక రాజయ్యను వారి పెద్ద అన్న చేరదీశాడు. కొంతకాలానికి ఆయన కూడా చనిపోవడంతో రాజయ్య మళ్లీ ఒంటరి వారయ్యారు. దీంతో ఎవరిపై ఆధారపడొద్దని నిర్ణయించుకుని గ్యాస్‌ పొయ్యిపై వంట చేయడం నేర్చుకున్నాడు. వారసత్వంగా వచ్చిన పెంకుటింట్లో రాజయ్య ఉంటున్నారు. చెప్పులు లేకపోయినా అతడు ఊరిలో ఏ దారి ఎక్కడికి పోతుందో సునాయసనంగా చెప్పగలడు. చూపులేకపోయినా వినోదం కోసం ఓ టీవీ పెట్టుకుని చూడకపోయినా ఆడియో వింటూ కాలక్షేపం చేసుకుంటున్నాడు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -