Nayanthara: నిర్మాతలను పీల్చి పిప్పి చేసి నయన్ సంపాదించిన ఆస్తులెంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Nayanthara: నటి నయనతార గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. టీవీ హోస్ట్ గా కెరియర్ ని మొదలుపెట్టిన ఈ భామ అనతకాలంలోనే వెండితెరపై అడుగుపెట్టి టాప్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. లేడీస్ సూపర్ స్టార్ అంటే నయనతార అనే రేంజ్ కి వెళ్ళిపోయింది ఈమె. తాజాగా ఈమె బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టి షారుక్ సరసన జవాన్ సినిమాలో హీరోయిన్గా నటించిన బాలీవుడ్ లో సైతం శభాష్ అనిపించుకుంది.

ప్రస్తుతం నయనతారకి దక్షిణాది వైపు నుంచే కాకుండా బాలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు క్యూ కడుతున్నాయి. దాంతో నయనతార చాలా సెలెక్టెడ్ గా సినిమాలు చేస్తుంది. ఇదే క్రమంలో ఆమె ఆస్తులపై మళ్ళీ కథనాలు తెరకెక్కుతున్నాయి. రెండు దశాబ్దాల నుంచి వెండి తెర మీద నటిస్తున్న ఈమె హీరోలని మించి సంపాదించిందని టాక్ వినిపిస్తుంది.

ఈమె ఆస్తి మొత్తంగా కలిపి 200 కోట్లు ఉంటుందని అంచనా. ఒక్కొక్క సినిమాకి పది కోట్లు తీసుకుంటుంది. అయితే జవాన్ సినిమాకి 12 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. బ్రాండ్స్ ఎండోన్స్మెంట్ ద్వారా ఏడాదికి కోట్లు అందుకుంటుంది. అంతేకాకుండా ద లిప్బామ్ తో పాటు మరికొన్ని కంపెనీలలో పెట్టుబడులు పెడుతుంది. అలాగే చెన్నై, హైదరాబాద్, కేరళలో నయనతార పేరిట లగ్జరీ ఇల్లు ఖరీదైన బంగాళాలు ఉన్నట్లు సమాచారం.

బీఎండబ్ల్యూ ఫైవ్ సిరీస్, మెర్సిడెస్, జి ఎల్ ఎస్ 350d, బీఎండబ్ల్యూ సెవెన్ సిరీస్ తో పాటు 50 కోట్ల ఖరీదు చేసే ప్రైవేట్ జెట్ కూడా నయనతారకి ఉంది. కేరళలో ఇప్పుడు ఆమె ఉంటున్న ఇల్లు దాదాపు 80 కోట్లు ఖరీదు చేస్తుందని అంటున్నారు. హైదరాబాదులో కూడా 50 కోట్ల విలువ చేసే రెండు బంగ్లాలు ఉన్నట్లు సమాచారం. అయితే ఈ వివరాలు తెలుసుకున్న నెటిజన్స్ షాక్ అవుతున్నారు. నయనతార ఇంత రిచ్చా.. చాలామంది హీరోలకి కూడా ఈ రేంజ్ లో ఆస్తులు లేవు అంటూ నోరెళ్లబెడుతున్నారు .

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -